Page Loader
ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు
ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు

ఐఫోన్ లో ఇకపై సులభంగా ట్విట్టర్ ట్వీట్‌లను బుక్‌మార్క్ చేయచ్చు

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 21, 2023
03:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

ట్విట్టర్ ఐఫోన్ వినియోగదారులు ట్వీట్‌లను సులభంగా బుక్‌మార్క్ చేసేలా ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. బుక్‌మార్క్ చేయడానికి వినియోగదారులు ట్వీట్ వివరాల క్రింద ఉన్న బుక్‌మార్క్ బటన్‌పై నొక్కాలి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల విషయానికొస్తే, ఫ్లాగ్ చిహ్నాన్ని నొక్కడం ద్వారా ఫోల్డర్‌లలో తమకు నచ్చిన ట్వీట్‌లను సేవ్ చేసుకోవచ్చు. ప్రకటనదారులు తమ సపోర్టును ఉపసంహరించుకోవడంతో, వినియోగదారులపైన ఆ సంస్థ దృష్టి పెట్టింది. ఇటువంటి అప్డేట్ లు కూడా అందులో ఒక భాగం. ట్విట్టర్ రాబోయే రోజుల్లో ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్‌లలో కూడా బుక్‌మార్కింగ్ సులభం చేసే ప్రయత్నాల్లో ఉంది. ఇంతకుముందు,ఐఫోన్ వినియోగదారులు షేరింగ్ విండోను తెరవడానికి షేర్ ఎంపికపై క్లిక్ చేసి, ఆపై ట్వీట్‌ను సేవ్ చేయడానికి బుక్‌మార్క్ బటన్‌ను నొక్కేవారు.

ట్విట్టర్

ఇంతకుముందు ట్వీట్ సేవింగ్ ప్రక్రియ చాలా గజిబిజిగా ఉండేది

ఇంతకుముందు ట్వీట్ సేవింగ్ ప్రక్రియ చాలా గజిబిజిగా ఉండేది, చాలా మంది బుక్‌మార్కింగ్‌కు ప్రత్యామ్నాయంగా 'లైక్' బటన్‌ను ఉపయోగించేవారు. ఇప్పుడు, బుక్‌మార్క్ బటన్‌పై క్లిక్ చేస్తే, స్క్రీన్ పైభాగంలో "Show all bookmarks" అనే ఆప్షన్ కూడా ఉంది. సేవ్ చేసిన బుక్‌మార్క్‌లను తీసేయాలనుకుంటే బుక్‌మార్క్‌ల విభాగానికి వెళ్లి, ట్వీట్‌లోని ట్వీట్ వివరాల భాగంలో 'Bookmark' పై నొక్కాలి. అదే సమయంలో, మీరు అన్ని బుక్‌మార్క్‌లను ఒకేసారి తీసేయాలనుకుంటే, బుక్‌మార్క్‌ల టైమ్‌లైన్ పైన ఉన్న 'More' పై క్లిక్ చేయాలి. బుక్‌మార్క్‌లు ప్రైవేట్ అవి ఖాతాలో మాత్రమే కనిపిస్తాయి. ఈ సదుపాయం ఐఫోన్ కి మాత్రమే పరిమితం కాదు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారులు కూడా దీన్నిచెక్ చెయ్యచ్చు.