వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు
ఎలోన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ట్విట్టర్ వినియోగదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఎదో ఒక సమస్యను ఎదుర్కొంటూనే ఉన్నారు. మొన్నటి వరకు ఖాతాలు నిలుపుదల, ఇతర సమస్యలను ఎదుర్కొన్న వినియోగదారులు... ఇప్పుడు వెబ్ నుండి సైన్ ఇన్ చేయడంలో సమస్యను ఎదుర్కుంటున్నారు. కొందరు వారి ట్విట్టర్ నోటిఫికేషన్‌లు కూడా పని చేయడం లేదని ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం 7:30 EST (12:30 pm GMT) నాటికి 8,700 కంటే ఎక్కువ మంది వినియోగదారులు సైట్‌తో సమస్యలను రిపోర్ట్ చేశారు. వెబ్‌సైట్ అంతరాయాలను ట్రాక్ చేసే డౌన్‌డెటెక్టర్ ద్వారా ఈ విషయం తెలిసింది.
ట్విట్టర్ లో కొత్త విధానాలను తీసుకురానున్న మస్క్
USD 44 బిలియన్ల డీల్‌లో ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన రెండు నెలల తర్వాత ఈ అంతరాయం ఏర్పడింది. ఎలోన్ మస్క్ ఇటీవలే తానూ పెట్టిన ఒక పోల్ ద్వారా ట్విట్టర్ సీఈఓ గా కొనసాగడం ఎక్కువమంది వినియోగదారులకు ఇష్టం లేదని తెలుసుకుని, ఆ పదవికి అర్హులైన వ్యక్తి దొరికిన తరవాత తానూ తప్పుకుంటానని చెప్పారు. ట్విట్టర్ ను చేజికించుకోగానే కొంతమంది సిబ్బందిని తొలగించారు. అంతే కాకుండా ఖాతాలకు చెల్లింపు సభ్యత్వ సేవను ప్రవేశపెట్టారు, ట్విట్టర్ మోడరేషన్ విధానాలకు విభజన సవరణలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా మస్క్ ట్విటర్ విధానాలను సంస్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కొత్త ట్విట్టర్ విధానం సైన్స్‌కు అనుకూలంగా ఉంటూ, సైన్స్ మీద అవగాహన తీసుకువచ్చేలా ఉంటుందని చెప్పారు.