
ఎలోన్ మస్క్ కు షాక్: ట్విట్టర్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ నుండి ఎక్స్ లోగో తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్, ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. కేవలం మార్చడమే కాదు శాన్ ఫ్రాన్సిస్కో లోని ట్విట్తర్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ మీద ఎక్స్ అనే లోగోను కూడా పెట్టాడు.
అయితే ఆ లోగోను ఇప్పుడు తొలగించారు. భారీ సైజులో ఉన్న లోగో కారణంగా ఆ వీధిలోని జనాలకు ఇబ్బంది కలగడమే దానికి కారణం. రాత్రవగానే ఎక్స్ లోగోలోని లైట్ల వెలుతురు అక్కడి జనాలను బాగా ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది.
మిణుకు మిణుకు మంటూ మెరిసే లోగో లైట్ల కారణంగా ఆ ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. దీంతో అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. అలా ఎక్స్ లోగోను తొలగించారు.
Details
మూడు రోజుల్లో లోగో తొలగింపు
ప్రస్తుతం ఎక్స్ లోగోను తొలగిస్తున్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం రోజు ఎక్స్ లోగోను పెట్టిన ఎలాన్ మస్క్, మూడురోజులు తిరగకుండానే తొలగించాల్సి వచ్చింది.
ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ చాలా మార్పులు చేస్తున్నారు. ట్విట్టర్ పేరును ఎక్స్ అని మార్చడం నుండి ట్వీట్ కు బదులుగా పోస్ట్ అనీ, రీట్వీట్ కు బదులుగా రీపోస్ట్ అని పరిభాషను మార్చేసాడు.
అంతేకాదు, మరికొద్ది రోజుల్లో ట్విట్టర్ లో మరికొన్ని మార్పులు రానున్నాయని సమాచారం. ట్విట్టర్ ని ఈ కామర్స్ సైట్ మాదిరిగా, గేమ్స్ సైట్ గా మార్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.