UFO or Natural Wonder: ఒక్కసారిగా పచ్చగా మెరిసిన ఆకాశం.. UFO అనుమానాలు.. అసలు విషయం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల హవాయి ఆకాశంలో కనిపించిన పచ్చటి వెలుగు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాత్రి వేళ ఒక్కసారిగా ఆకాశం గ్రీన్ కలర్‌లో మెరుస్తూ కనిపించడంతో, చాలా మంది దీన్ని UFOగా అనుమానించారు. సోషల్ మీడియాలో కూడా "ఎలియన్స్ వచ్చారా?" అంటూ పలు కథనాలు వైరల్ అయ్యాయి. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ అనుమానాలకు చెక్ పెట్టారు. ఇది ఎలాంటి UFO కాదు, "ఎయిర్ గ్లో" అనే సహజ వాతావరణ ప్రక్రియ అని స్పష్టం చేశారు. ఎయిర్ గ్లో అనేది భూమి పై వాతావరణంలో సహజంగా జరిగే ప్రక్రియ. పగలు సూర్యకాంతి ప్రభావంతో వాయుమండలంలోని గ్యాస్ అణువులు విడిపోతాయి.
వివరాలు
గ్రీన్ రంగు వెలుగు రావడానికి కారణం ఆక్సిజన్ అణువులే
రాత్రి అవి మళ్లీ కలిసే సమయంలో తక్కువ స్థాయి వెలుగు విడుదల అవుతుంది. ఈ ప్రక్రియ చాలా స్వల్పంగా ఉండటంతో సాధారణంగా మన కళ్లకు కనిపించదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రీన్ రంగు వెలుగు రావడానికి కారణం ఆక్సిజన్ అణువులే. భూమి పైభాగంలో ఉన్న ఆక్సిజన్ అణువులు అదనపు శక్తిని విడుదల చేసే సమయంలో పచ్చటి కాంతిని ఇస్తాయి. ఇది కొంతవరకు ఔరోరాల్లా కనిపించినా, అసలు అది భిన్నం. ఔరోరాలు సూర్య కణాలు భూమి మాగ్నెటిక్ ఫీల్డ్‌తో ఢీకొన్నప్పుడు ఏర్పడతాయి. కానీ ఎయిర్ గ్లో మాత్రం నెమ్మదిగా, ఆకాశం మొత్తం వ్యాపించిన సాఫ్ట్ లైట్‌లా ఉంటుంది.
వివరాలు
ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా..
ఈసారి హవాయిలో ఇది స్పష్టంగా కనిపించడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఆ రోజు ఆకాశం చాలా క్లియర్‌గా ఉండటం, లైట్ పొల్యూషన్ చాలా తక్కువగా ఉండటం, అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఈ గ్లో కంటికి పడింది. సాధారణంగా నగరాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించడం చాలా అరుదు. ఇది కేవలం హవాయిలోనే కాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతూనే ఉంటుంది.
వివరాలు
ప్రకృతి అందించిన మరో అద్భుతం
భారత్, అమెరికా, సముద్ర ప్రాంతాలు వంటి చోట్ల కూడా ఎయిర్ గ్లో ఉంటుంది. కానీ దీనిని స్పష్టంగా చూడాలంటే క్లియర్ స్కై, తక్కువ వెలుగు కాలుష్యం, పొడి వాతావరణం అవసరం. అందుకే దీవులు, ఎడారి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మొత్తానికి, హవాయి ఆకాశంలో కనిపించిన ఈ గ్రీన్ వెలుగు ఎలాంటి మిస్టరీ కాదు, ప్రకృతి అందించిన మరో అద్భుతం మాత్రమే. UFOలతో సంబంధం లేకుండా, సైన్స్ ద్వారా అర్థం చేసుకోవచ్చిన అందమైన సహజ ఘటనగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.