Loading...
Solar Corona: సూర్యుడిపై కొత్త సుడిగుండాలు.. కరోనా వేడి రహస్యం చేధించిన శాస్త్రవేత్తలు
కరోనా వేడి రహస్యం చేధించిన శాస్త్రవేత్తలు

Solar Corona: సూర్యుడిపై కొత్త సుడిగుండాలు.. కరోనా వేడి రహస్యం చేధించిన శాస్త్రవేత్తలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

సూర్యుడి ఉపరితలంపై ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యాలను ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు. బంగారు రంగు పట్టీలు, సుడిగుండాల్లా తిరిగే సూక్ష్మ వలయాలు ఈ చిత్రాల్లో స్పష్టంగా కనిపించాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సౌర టెలిస్కోప్‌గా పేరుగాంచిన హవాయిలోని ఇనోయే సోలార్ టెలిస్కోప్ సాయంతో ఈ చిత్రాలను సేకరించారు. శాస్త్రవేత్తలు సూర్యుడిపై అయస్కాంత క్షేత్రాలు అత్యంత చురుకుగా ఉండే ప్రాంతాన్ని, సన్‌స్పాట్‌కు సమీపంలో పరిశీలించారు. అక్కడ కేవలం 20 కిలోమీటర్ల కంటే చిన్న పరిమాణంలో ఉన్న నిర్మాణాలను కూడా గుర్తించారు. ఇప్పటివరకు సూర్యుడిపై ఇంత సూక్ష్మ స్థాయి వివరాలు నమోదు కావడం ఇదే తొలిసారి.

వివరాలు 

సూర్యుడి రహస్యాలను ఛేదిస్తున్న అత్యాధునిక టెలిస్కోప్

ఈ తాజా చిత్రాలు సూర్యుడి బయటి వాతావరణమైన కరోనా ఎందుకు సూర్యుడి ఉపరితలం కంటే లక్షల డిగ్రీల మేర ఎక్కువ వేడిగా ఉంటుందనే దశాబ్దాల నాటి రహస్యానికి సమాధానం చూపే అవకాశముందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అమెరికా నేషనల్ సోలార్ అబ్జర్వేటరీకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రెడ్రిక్ వోగర్ మాట్లాడుతూ,ఇవి ఇప్పటివరకు సూర్యుడి ఉపరితలంపై తీసిన అత్యధిక స్పష్టత కలిగిన చిత్రాలని తెలిపారు.

హవాయిలోని మౌయి దీవిలో ఉన్న హలేకల అగ్నిపర్వత శిఖరానికి సమీపంలో ఈ టెలిస్కోప్ పనిచేస్తోంది.

ఇంతకుముందు ఇదే టెలిస్కోప్‌తో తీసిన చిత్రాల్లో ఫ్రాన్స్ దేశం పరిమాణంలో ఉండే ధాన్యాకార నిర్మాణాలు మాత్రమే కనిపించాయి.

అప్పట్లో సుమారు 30కిలోమీటర్ల పరిమాణంలోని వివరాలను గుర్తించగలిగారు.

వివరాలు 

సూర్యుడిపై కొత్త సుడిగుండాల గుట్టు విప్పిన చిత్రాలు 

అయితే తాజా చిత్రాలు టెలిస్కోప్ సామర్థ్యానికి అత్యంత దగ్గర స్థాయిలో తీసినవిగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ పరిశోధనలో పాల్గొన్న ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ కురిడ్జే మాట్లాడుతూ, సూర్యుడిపై ఇంత చిన్న పరిమాణంలోని నిర్మాణాలను చూడటం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు.

ఇప్పటివరకు జరిగిన ఏ సౌర పరిశీలనలోనూ ఇలాంటి దృశ్యాలు కనిపించలేదని చెప్పారు.

తాజా చిత్రాల్లో కనిపించిన సుడిగుండాల్లాంటి నిర్మాణాలను శాస్త్రవేత్తలు కెల్విన్-హెల్మ్‌హోల్ట్జ్ అస్థిరతలు (Kelvin-Helmholtz Instabilities - KHI)గా గుర్తించారు.

వేగంగా కదిలే ప్లాస్మా, నెమ్మదిగా కదిలే ప్లాస్మా పొరలను దాటినప్పుడు ఏర్పడే ఘర్షణ వల్ల ఇవి ఉత్పత్తి అవుతాయి.

మొదట చిన్న అలజడిలా ప్రారంభమై, తర్వాత సుడిగుండాల రూపంలో విస్తరిస్తాయని వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

సూర్యుడిపై తొలిసారి గుర్తించిన అస్థిరతలు.. భూమిపైనా ప్రభావం! 

ఇలాంటి అస్థిరతలను భూమిపై సరస్సులు, సముద్రాలు, మేఘాల నిర్మాణాల్లో, అలాగే గురుడు, శని గ్రహాల వాతావరణంలో ఇప్పటికే గుర్తించారు.

అయితే సూర్యుడిపై వీటి ఉనికిని ఇప్పటివరకు నిర్ధారించలేకపోయారు.

ఈ తాజా పరిశోధన వివరాలను ప్రముఖ శాస్త్రీయ జర్నల్ నేచర్ ప్రచురించింది.

సూర్యుడిపై సంభవించే సౌర జ్వాలలు, ప్లాస్మా జెట్లు, కరోనా మాస్ ఎజెక్షన్‌లాంటి భారీ పేలుళ్లకు కారణం తీవ్రమైన అయస్కాంత క్షేత్రాలేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇవి భూమిపై విద్యుత్ వ్యవస్థలు, ఉపగ్రహాలు, జీపీఎస్ సేవలు, ప్రపంచ కమ్యూనికేషన్ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

సూర్యుడి వేడి రహస్యానికి సుడిగుండాలే కీలకమా?  

సూర్యుడిలోని వేడి ప్లాస్మా కదలికల వల్ల ఈ అయస్కాంత క్షేత్రాలు ఏర్పడుతున్నప్పటికీ, వాటి పూర్తి భౌతిక ప్రక్రియ ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు.

అయస్కాంత రేఖలు జుట్టు అల్లినట్లుగా ఒకదానితో ఒకటి ముడిపడి,ఒక్కసారిగా తెగిపోవడంతో భారీ శక్తి విడుదలవుతుందని శాస్త్రవేత్తలకు తెలుసు.

అయితే ఆ ప్రక్రియ ఎలా ప్రారంభమవుతుందన్న ప్రశ్నకు ఇప్పటివరకు సమాధానం లేదు.

తాజాగా గుర్తించిన ఈ సూక్ష్మ సుడిగుండాలే ఆ ప్రక్రియకు ఆరంభ కారణమై ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇవే అయస్కాంత రేఖలను మెలికలు తిరిగేలా చేసి, చివరకు శక్తి వేడిగా మారేందుకు దోహదపడతాయని చెబుతున్నారు.

వివరాలు 

కరోనా వేడి రహస్యానికి కొత్త ఆధారాలు

దీంతో సూర్యుడి ఉపరితలం సుమారు 6,000 డిగ్రీల సెల్సియస్ మాత్రమే ఉన్నప్పటికీ, కరోనా మాత్రం లక్షల నుంచి మిలియన్ల డిగ్రీల వరకు వేడిగా ఉండటానికి ఇదే కారణమై ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

డాక్టర్ డేవిడ్ కురిడ్జే మాట్లాడుతూ, ఈ పరిశోధనతో గత యాభై ఏళ్లుగా సౌర భౌతిక శాస్త్రాన్ని వేధిస్తున్న అతిపెద్ద రహస్యానికి సమాధానం లభించే అవకాశం ఉందన్నారు.

ఈ అస్థిరతల ద్వారా శక్తి చిన్న చిన్న స్థాయిలకు చేరి చివరకు వేడిగా మారుతుందని, అదే సూర్యుడి కరోనా మాత్రమే కాకుండా ఇతర నక్షత్రాల బయటి వాతావరణాల వేడిమికి కూడా కారణమై ఉండొచ్చని వివరించారు.

ADVERTISEMENT