Vikram-1: విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. భారత అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయి!
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష రంగం మరో కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. మధ్యాహ్నం 12:05 గంటలకు నిప్పులు చిమ్ముతూ రాకెట్ అంతరిక్షయాత్రను ప్రారంభించింది. ముందుగా నిర్ణయించిన సమయానికే ప్రయోగం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, చివరి క్షణంలో గుర్తించిన సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. లాంచ్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత, రాకెట్ లాంచ్ ప్యాడ్‌ను వీడే కొద్ది నిమిషాల ముందు సిస్టమ్‌లలో సాంకేతిక లోపాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వివరాలు
సూమారు 35 నిమిషాల పాటు అలస్యం
ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని నిలిపివేసి, సమస్యపై శాస్త్రవేత్తల బృందం వెంటనే పరిశీలన ప్రారంభించింది.
లోపానికి గల కారణాన్ని గుర్తించి దాన్ని సరిచేసిన అనంతరం మళ్లీ కౌంట్‌డౌన్ ప్రారంభించారు.
సాంకేతిక సమస్య పూర్తిగా పరిష్కారమైన తర్వాత మధ్యాహ్నం 12:05 గంటలకు విక్రమ్-1 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించారు.
ఈ కారణంగా ప్రయోగం సుమారు 35 నిమిషాలు ఆలస్యమైనట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాంకేతిక అవరోధాలను అధిగమించి విజయవంతంగా సాగిన ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి మరో మైలురాయిగా నిలిచింది.