
vivo: వివో వై400 5జీ రేపు విడుదల.. భారీ బ్యాటరీ, శక్తివంతమైన కెమెరా ఫీచర్స్!
ఈ వార్తాకథనం ఏంటి
స్మార్ట్‌ఫోన్ తయారీదారైన వివో (Vivo) మరో కొత్త డివైస్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సంస్థ వై400 (Y400) 5జీ పేరుతో ఓ మిడ్‌రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్ట్ 4న విడుదల చేయనుంది. ఇదే సంస్థ గత నెలలో విడుదల చేసిన వై400 ప్రోకి ఇది సీక్వెల్‌గా రానుండటం విశేషం. వివో అధికారికంగా వెల్లడించిన ప్రకారం, వై400 5జీ మోడల్‌ను గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ రంగుల్లో అందించనున్నారు. విడుదల చేసిన టీజర్ పిక్స్‌ను బట్టి చూస్తే.. వై400 ప్రో మాదిరిగానే దీన్నికూడా కర్వ్డ్ రియర్ డిజైన్, డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
Details
స్పెసిఫికేషన్లు (లీక్ ఆధారంగా అంచనాలు)
టెక్ టిప్‌స్టర్ సుధాంశు అంబోర్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే (AMOLED)తో రానుంది. ఇది 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండనుందని అంచనా. కెమెరా సెటప్ వివో వై400 5జీ డ్యూయల్ రియర్ కెమెరాలతో రాబోతుంది. ఇందులో 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, అలాగే 2MP బోకె సెన్సార్ ఉండనుంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చని సమాచారం.
Details
ప్రాసెసర్, స్టోరేజ్
ఈ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ (Snapdragon 4 Gen 2 SoC) ఉండనుంది. ఇది గతంలో పోకో ఎం7, లావా బ్లేజ్ డ్రాగన్ వంటి ఫోన్‌లలో ఉపయోగించారు. రెండు వేరియంట్లలో రానుంది 8GB RAM + 128GB స్టోరేజ్ 8GB RAM + 256GB స్టోరేజ్ బ్యాటరీ, ఛార్జింగ్ వైవో వై400 ప్రోతో పోలిస్తే, ఈ ఫోన్‌లో పెద్ద బ్యాటరీ ఉండనుంది. ఇది 6000mAh బ్యాటరీతో, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుందని టిప్‌స్టర్స్ చెబుతున్నారు.
Details
సాఫ్ట్‌వేర్, అదనపు ఫీచర్లు
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 ఉండనుంది. అలాగే స్టీరియో స్పీకర్ సెటప్, ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68/IP69 రేటింగ్స్ (వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం) వంటి ఫీచర్లు ఉండవచ్చని అంచనా. అంచనా ధర లీక్‌ల ప్రకారం 8GB + 128GB వేరియంట్ ధర రూ.21,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.23,999గా ఉండే అవకాశం ఉంది. పూర్తి స్పెసిఫికేషన్లు, ఖచ్చితమైన ధర వివరాలు లాంచ్ సమయంలో అంటే ఆగస్ట్ 4న వెల్లడికానున్నాయి.