Page Loader
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త 

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ అనేది సాంకేతిక విప్లవం అని చెప్పాలి. ఏఐ వల్ల సాంకేతిక రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే ఇది సైబర్ నేరగాళ్లకు పెద్ద ఆయుధంగా కూడా మారుతోందంటూ కొన్ని ఉదంతాలు సాక్షాత్కరిస్తున్నాయి. వాస్తవాలు, కల్పన మధ్య సరిహద్దులను ఏఐ చెరిపివేస్తున్న నేపథ్యంలో ఇది ​​సైబర్ నేరస్థులు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి సాయపడుతోంది. తద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త తరహా స్కామ్‌లకు పాల్పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో విస్తృతంగా అందుబాటులో ఉన్న ఏఐ వాయిస్ క్లోనింగ్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఏఐ వాయిస్ క్లోనింగ్ సాధనాలతో చేసిన స్కామ్‌లు ఇటీవల అమెరికాలో వెలుగుచూశాయి.

ఏఐ

కూతురు వాయిస్‌తో 1 మిలియన్ డాలర్లు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లు

డిస్టెఫానో తన 15ఏళ్ల కుమార్తె అరిజోనా స్కీయింగ్ ట్రిప్‌కు వెళ్తుంది. అరిజోనా గొంతును ఏఐ వాయిస్ టూల్ సాయంతో రికార్డు చేసి డిస్టెఫానోకు కాల్ చేస్తారు. ఆ ఫోన్‌లో 'నాకు సహాయం చేయండి అమ్మ, దయచేసి నాకు సహాయం చేయండి' అంటూ అరిజోనా ఏడవడం డిస్టెఫానో గమనిస్తుంది. అది 100శాతం బాధలో ఉన్న తమ కుమార్తె అరిజోనా గొంతే అని డిస్టెఫానో అనుకుంది. తర్వాత సైబర్ నేరస్థుడు ఫోన్ తీసుకొని డిస్టెఫానో నుంచి 1మిలియన్ డాలర్లు డిమాండ్ చేశాడు. అనంతరం తనకు ఫోన్ వచ్చిన నంబర్ డిస్టెఫానో చూడగా అది అన్‌నోన్ నంబర్ చూపించింది. డిస్టెఫానో తన కుమార్తెకు కాల్ చేయగా ఇది మోసం అని తేలింది. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించింది.