LOADING...
గ్రూప్ ఇంటరాక్షన్‌ల కోసం ఐఫోన్ లో కొత్త ఫీచర్‌ను విడుదల చేసిన వాట్సాప్
ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో 1,024 మంది ఉండే అవకాశం ఉంది

గ్రూప్ ఇంటరాక్షన్‌ల కోసం ఐఫోన్ లో కొత్త ఫీచర్‌ను విడుదల చేసిన వాట్సాప్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 23, 2023
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది, ఇది గ్రూప్ అడ్మిన్‌లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంస్థ ఈ ఫీచర్ ద్వారా అనేక షార్ట్‌కట్‌లను అందిస్తుంది, వీటిని ఉపయోగించి అడ్మిన్‌లు గ్రూప్ లో ఉన్నవారి పై త్వరగా చర్యలు తీసుకోగలరు. యాప్ స్టోర్ నుండి ఇన్‌స్టాల్ చేయగల అప్డేట్ వెర్షన్ 23.1.75లో అందుబాటులో ఉంది. వాట్సాప్‌లో గ్రూప్ ఇంటరాక్షన్‌లను నిర్వహించడం అనేది కనిపించే దానికంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ లో 1,024 మంది సభ్యులు ఉండే అవకాశం ఉంది కాబట్టి పాల్గొనేవారితో కమ్యూనికేషన్‌ సరైన రీతిలో చెయ్యాల్సిన అవసరం ఏర్పడింది. కొత్తగా వచ్చిన ఈ ఫీచర్ పెద్ద గ్రూప్స్ లో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

వాట్సాప్

ఒక మెంబర్ కాంటాక్ట్ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది

'Contact shortcuts in groups' ఫీచర్ గ్రూప్ అడ్మిన్‌లకు ప్రయోజనకరంగా ఉంటుంది, ఇది గ్రూప్ నుండి ఒక మెంబెర్ ను ఎంచుకుని వారితో ప్రైవేట్‌గా కమ్యూనికేట్ చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మొదట అడ్మిన్ గా ఉన్న గ్రూప్ లోకి వెళ్ళాలి. గ్రూప్ ఈవెంట్‌లలో (పాల్గొనేవారు చేరినప్పుడు/లెఫ్ట్ అయినప్పుడు) హైలైట్ చేయబడిన ఫోన్ నంబర్‌లను చూడచ్చు. ఆ నంబర్‌ను నొక్కి పట్టుకున్నప్పుడు, త్వరగా కాల్ చేయగల లేదా ప్రైవేట్‌గా చాట్ చేసే అవకాశంతో కొత్త షార్ట్‌కట్‌ల లిస్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ నంబర్‌ను కాపీ చేయవచ్చు లేదా కాంటాక్ట్ లిస్ట్ లోకి యాడ్ చేయచ్చు. ఒక మెంబర్ కాంటాక్ట్ సమాచారాన్ని తెలుసుకోవడానికి అడ్మిన్ ఇకపై గ్రూప్ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ ద్వారా వెతకాల్సిన అవసరం లేదు.