WhatsApp Sound Stickers: వాట్సాప్ స్టిక్కర్లు కూడా మాట్లాడతాయండోయ్..
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్‌లో ఇప్పటివరకు మన భావాలను చెప్పేందుకు టెక్ట్స్ మెసేజ్‌లు, ఎమోజీలు, స్టిక్కర్లు ఉపయోగిస్తున్నాం. అయితే ఇకపై స్టిక్కర్ కూడా తనదైన గొంతుతో మన సందేశాన్ని వినిపించనుంది. దీనికోసం వాట్సాప్ 'సౌండ్ స్టిక్కర్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా సాధారణ స్టిక్కర్లకు ఆడియో జోడించవచ్చు. అంతేకాదు, వీడియోలోని ఒక భాగాన్ని దాని అసలు శబ్దంతో సహా స్టిక్కర్‌గా మార్చుకునే సదుపాయం కూడా కల్పించనుంది. దీంతో చాటింగ్ మరింత ఆసక్తికరంగా మారనుంది.
Details
స్టిక్కర్‌కు నచ్చిన ఆడియోను జోడించొచ్చు
ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే స్టిక్కర్‌ను ఎంచుకున్నప్పుడు 'యాడ్ సౌండ్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.
దానిపై క్లిక్ చేసి కావాల్సిన ఆడియోను జోడించుకోవచ్చు. అంటే ఒక స్టిక్కర్ ద్వారా కేవలం బొమ్మను మాత్రమే కాకుండా, దానికి సంబంధించిన శబ్దాన్ని కూడా స్నేహితులకు పంపవచ్చన్నమాట.
సాధారణంగా స్టిక్కర్లతో స్పందించే వారికి ఇది కొత్త అనుభూతిని అందించనుంది.
ముఖ్యంగా సరదా సంభాషణల్లో తమ భావాలను మరింత స్పష్టంగా, వినోదాత్మకంగా వ్యక్తం చేసేందుకు ఉపయోగపడుతుంది.
Details
వీడియోను కూడా సౌండ్‌తో స్టిక్కర్‌గా మార్చుకోవచ్చు
వీడియోలోని చిన్న భాగాన్ని స్టిక్కర్‌గా పంపాలనుకుంటే కీబోర్డ్‌లోని 'క్రియేట్ స్టిక్కర్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఆ తర్వాత అవసరమైన వీడియో భాగాన్ని కట్ చేసి స్టిక్కర్‌గా రూపొందించుకోవచ్చు. ఇందులో వీడియోకు సంబంధించిన ఆడియో కూడా జతగా ఉంటుంది.
అయితే చాట్‌లో ఈ స్టిక్కర్ వచ్చిన వెంటనే శబ్దం వినిపించదు. దాని కింద కనిపించే ఆడియో బటన్‌ను నొక్కినప్పుడే సౌండ్ ప్లే అవుతుంది.
ఇలా చేయడం వల్ల యూజర్లకు ఎప్పుడు ఆడియో వినాలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది.
Details
ముందుగా బీటా వెర్షన్‌లో పరీక్షలు
ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేదు. తొలుత ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.26.41.3లో కనిపించనుంది.
అక్కడ పరీక్షలు పూర్తయిన తర్వాత దశలవారీగా ఇతర యూజర్లకు అందించే అవకాశం ఉంది.
వాట్సాప్ ఇప్పటికే స్టిక్కర్లను చాటింగ్‌లో ముఖ్యమైన భాగంగా మార్చింది.
ఇప్పుడు వాటికి శబ్దాన్ని జోడించడం ద్వారా సందేశాలు పంపే విధానంలో మరో మార్పునకు సిద్ధమవుతోంది.
అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.