LOADING...
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రోలో బ్లాక్ రంగుకు గుడ్‌బై చెప్పిన ఆపిల్?
ఐఫోన్ 18 ప్రోలో బ్లాక్ రంగుకు గుడ్‌బై చెప్పిన ఆపిల్?

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రోలో బ్లాక్ రంగుకు గుడ్‌బై చెప్పిన ఆపిల్?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 03, 2026
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ విడుదల చేయబోయే కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఐఫోన్ 18 ప్రోలో బ్లాక్ కలర్ ఆప్షన్ లేకపోవచ్చని తాజా లీక్స్ సూచిస్తున్నాయి. ఈ సమాచారం చైనా టిప్‌స్టర్ 'Instant Digital' ద్వారా బయటకు వచ్చింది. అతను గతంలో చెప్పిన పలు లీక్స్ నిజం కావడంతో ఈ వార్తకు ప్రాధాన్యం పెరిగింది. చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Weiboలో ఈ విషయాన్ని షేర్ చెయ్యడం.. ఇది వరుసగా రెండో సంవత్సరం కావడం గమనార్హం. గత ఏడాది వచ్చిన iPhone 17 Proలో కూడా బ్లాక్ కలర్ కనిపించలేదు.

వివరాలు 

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో డీప్ రెడ్ కలర్ వచ్చే అవకాశం 

అయితే, ఐఫోన్ ప్రారంభమైన 2007 నుంచీ బ్లాక్ రంగు ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో ముఖ్యమైన స్థానంలో ఉండేది. మధ్యలో కంపెనీ స్పేస్ గ్రే, గ్రాఫైట్, స్పేస్ బ్లాక్, బ్లాక్ టైటానియం వంటి వేరియేషన్లు తీసుకొచ్చింది. అయినప్పటికీ, ఇటీవల కాలంలో Apple కొత్త కలర్ ఎక్స్‌పెరిమెంట్స్‌ చేస్తోంది. తాజా రిపోర్టుల ప్రకారం, ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో డీప్ రెడ్ కలర్ వచ్చే అవకాశముందని సమాచారం.

వివరాలు 

సెప్టెంబర్‌లో iPhone 18 Pro సిరీస్

ఈ ఏడాది సెప్టెంబర్‌లో iPhone 18 Pro సిరీస్ విడుదల అయ్యే అవకాశం ఉంది. కొత్త లీక్స్ ప్రకారం, ఫేస్ ఐడీ కోసం ఉన్న పిల్-షేప్ కట్‌ఔట్ చిన్నదిగా మారవచ్చు. కొన్ని సెన్సార్లను డిస్‌ప్లే క్రింద ఉంచే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణ iPhone 18 మోడల్స్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా, ప్రో మోడల్స్‌లో 2nm A20 Pro చిప్, 5000mAh కంటే ఎక్కువ బ్యాటరీ, మెరుగైన కెమెరాలు వంటి అప్‌గ్రేడ్స్ వచ్చే అవకాశముంది.

Advertisement