
#NewsBytesExplainer: ఫంగల్ ఇన్ఫెక్షన్లు వేగంగా పెరగడానికి కారణాలు ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
మనం పర్యావరణ ప్రభావాల గురించి మాట్లాడేటప్పుడు కార్చిచ్చులు పెరగడం, అధిక ఉక్కపోతలు ఉండటం, పంటలు నాశనం అవ్వడం వంటి అంశాలను ఎక్కువగా చర్చిస్తుంటాం.
అయితే, వాతావరణ మార్పుల ప్రభావంగా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఫంగల్ వ్యాధుల పెరుగుదల గురించి మాత్రం చాలా తక్కువగా చర్చిస్తుంటాం.
ఫంగస్ వ్యాప్తి , ఫంగల్ వ్యాధులు
ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల గతంలో చలిగా ఉండే ప్రాంతాల్లో జీవించలేని ఫంగస్‌లు ఇప్పుడు అక్కడ సులభంగా జీవించగలుగుతున్నాయి.
ఫలితంగా, అక్కడ ఫంగస్ వ్యాప్తి జరుగుతోంది. యూరప్ వంటి దేశాల్లో కూడా ముందుగా వేడి వాతావరణంలో మాత్రమే కనిపించే ప్రాణాంతక ఫంగస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధన చెబుతోంది.
వ్యాధి
ఆస్పెర్‌గిల్లోసిస్ ప్రమాదకర వ్యాధి
ప్రతి సంవత్సరం దాదాపు 18లక్షల మంది ఆస్పెర్‌గిల్లోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధితో మరణిస్తున్నారని అంచనా.
ఈ వ్యాధి దక్షిణ అమెరికా,ఆఫ్రికా నుంచి ఉత్తర ప్రాంతాలకు వ్యాపిస్తోంది.పాపులర్ టీవీ సీరీస్ "ది లాస్ట్ ఆఫ్ అజ్"లో చూపిన ఫంగల్ డిసీజ్ ఏదో ఫిక్షన్ కాదు..ఇటువంటి పరిస్థితులు వాస్తవంగా జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫంగస్ మన చుట్టూ ఉంది
యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్‌కి చెందిన ప్రొఫెసర్ అడెలియా వారిస్ ప్రకారం,ఫంగల్ పాథోజెన్స్ మన చుట్టూ గాలి,నేల ద్వారా మైల్స్ దూరం వ్యాపించగలవు.
ఫంగస్ వల్ల కలిగే వ్యాధులు బ్యాక్టీరియా,వైరస్ లాంటి వాటి మాదిరిగానే ప్రాణాంతకంగా మారవచ్చు.
వివరాలు
కాండిడా అల్బికాన్స్ - మన శరీరంలో ఉండే ఈస్ట్ ఫంగస్
"ఫంగస్ చర్మానికి సోకడం,గోళ్లకు వ్యాపించడం సాధారణమే అయినా,ఊపిరితిత్తుల ప్రవేశించినప్పుడు అది ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు.'' అని వివరించారు.
చాలా మంది ఆరోగ్యవంతుల శరీరంలోనే కొన్ని రకాల ఫంగస్‌లు ఉంటాయి.
ఉదాహరణకు కాండిడా అల్బికాన్స్ అనే ఈస్ట్ ఫంగస్ మన కడుపులో సహజంగా ఉంటుంది.
ఇది సాధారణంగా హాని చేయదు కానీ, రోగనిరోధక శక్తి బలహీనపడినప్పుడు రక్తంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుంది.
ఫంగస్ పెరిగితే సమస్యలేంటి?
ఫంగస్ మన చుట్టూ ఎప్పటినుంచో ఉన్నా,ఇప్పుడు పెరిగిన ఉష్ణోగ్రతలు,మెడికల్ అభివృద్ధుల వల్ల మనిషి ఆయుర్దాయం పెరగడం,రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి అంశాలు సమస్యను పెంచాయి.
కీమోథెరపీ,అవయవ మార్పిడి వంటి చికిత్సల తర్వాత రోగులు ఫంగల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతున్నారు.
వివరాలు
వనరుల లోపం,అర్థం చేసుకోవాల్సిన అసమతుల్యత
గ్లోబల్ సౌత్ దేశాల్లో (ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా) వైద్య వసతులు పరిమితంగా ఉండటంతో ఫంగల్ వ్యాధుల నిర్ధారణ,చికిత్స సవాలుగా మారుతోంది.
హెచ్ఐవీ/ఎయిడ్స్ ప్రభావం వల్ల ఇటువంటి ప్రాంతాల్లో ఫంగస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది.
తీవ్రమవుతున్న భూ ఉష్ణోగ్రతలు - కొత్త సవాళ్లు
జాన్స్ హాప్కిన్స్ ప్రొఫెసర్ ఆర్టురో కాసాదేవాల్ ప్రకారం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఫంగస్ కొత్త ప్రాంతాల్లో వ్యాప్తి చెందుతోంది.
కొన్ని ప్రాంతాల్లో ఎడారులు ఏర్పడుతుండగా, మరికొన్ని చోట్ల ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి ఫంగస్ పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.
వివరాలు
శరీర ఉష్ణోగ్రత తగ్గడం కూడా ఒక కారణం
మన శరీర ఉష్ణోగ్రత గతంతో పోలిస్తే కొంత తగ్గుతోంది. గతంలో శరీర వేడి అధికంగా ఉండటంతో ఫంగస్ జీవించలేకపోయేది.
కానీ ఇప్పుడు శరీర ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల ఫంగస్ జీవించగలగడం సాధ్యమవుతోంది.
చికిత్సల కోసం వాడే మందుల ప్రభావం
అజలీస్ అనే ఫంగల్ ఔషధాలను పంటలను రక్షించేందుకు విస్తృతంగా వాడుతున్నారు.
దీనివల్ల ఆస్పెర్‌గిల్లస్ వంటి ఫంగస్‌లు ఔషధాల పట్ల ప్రతిఘటించే సామర్థ్యం పెంచుకున్నాయి. ఇది ఆసుపత్రుల్లో చికిత్సకు ఆటంకంగా మారుతోంది.
వివరాలు
పరిష్కార మార్గాల కోసం శోధనలు
మైఖేల్ బ్రోమ్లీ నేతృత్వంలో కొత్త కెమికల్స్ అభివృద్ధి చేయబడ్డాయి. ఇవి ఫంగస్ డీఎన్ఏను లక్ష్యంగా చేసుకుంటాయి.
ఫోస్మానోజెపిక్స్ అనే మందు కూడా ఫంగస్‌ను నియంత్రించే విప్లవాత్మక పరిష్కారంగా భావిస్తున్నారు.
వివరాలు
ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి
ఆస్పెర్‌గిల్లస్ వంటి వ్యాధులు ప్రతి సంవత్సరం వేలమందిని చంపుతున్నాయి.
ఫంగస్ గాలిలో నుంచే ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి ప్రాణాంతకమవుతుంది.
కొత్త మందులు పరిష్కారంగా ఉన్నా, వాస్తవంలో ఈ వ్యాధులను పూర్తిగా అడ్డుకోవచ్చా? అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా స్పష్టంగా లేదు.
పెరుగుతున్న జనాభా, ఆహార అవసరాలు, ఫంగీసైడ్ల వినియోగం నేపథ్యంలో ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళిక అవసరం.