Pluto: గ్రహాల జాబితాలోకి ప్లూటో రీఎంట్రీ? నాసా చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి 'డ్వార్ఫ్ ప్లానెట్'గా ప్రకటించింది. గ్రహం అవ్వాలంటే సూర్యుని చుట్టూ తిరగాలి, గుండ్రంగా ఉండేంత గురుత్వాకర్షణ ఉండాలి, తన కక్ష్యలోని ఇతర అవశేషాలను తొలగించాలి అనే నిబంధనలు పెట్టింది. ప్లూటో మొదటి రెండు నిబంధనలు పూర్తి చేసినా, మూడోది ఫెయిల్ అయింది. క్యూయిపర్ బెల్ట్‌లో మరెన్నో చిన్న గ్రహాలతో కలిసి తిరుగుతుండటమే కారణం.
వివరాలు
కొండలు, మంచు గ్లేసియర్లు, విభిన్న భౌగోళిక లక్షణాలు
అయితే ఈ నిబంధనలు సరిగా అమలు చేయలేదని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. 2015లో నాసా 'న్యూ హొరైజన్స్' మిషన్ ప్లూటో దగ్గరగా తీసిన చిత్రాలు కొత్త ఆశ్చర్యాలను చూపించాయి. కొండలు, మంచు గ్లేసియర్లు, విభిన్న భౌగోళిక లక్షణాలు కనిపించాయి. దీంతో మళ్లీ ప్లూటోను గ్రహంగా గుర్తించాలని నాసా చీఫ్ జారెడ్ ఐజాక్‌మన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇలా చేస్తే మరెన్నో డ్వార్ఫ్ గ్రహాలకు కూడా పూర్తి గ్రహ హోదా ఇవ్వాల్సి వస్తుందని నిపుణుల హెచ్చరిక.