X Chat: వాట్సాప్‌కు దీటుగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతతో 'ఎక్స్' కొత్త 'చాట్' ఫీచర్..!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత కమ్యూనికేషన్ విధానాలను దృష్టిలో పెట్టుకొని, ఎక్స్ (X) సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ తన డైరెక్ట్ మెసేజింగ్ (DM) వ్యవస్థలో భారీ మార్పులు చేసి 'చాట్ (Chat)' పేరుతో కొత్తగా ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజింగ్ సేవను తీసుకొచ్చింది. ఈ కొత్త చాట్ ఫీచర్, కేవలం మెసేజ్‌లు పంపడానికే కాకుండా మరెన్నో అధునాతన సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఇప్పుడు వినియోగదారులు ఈ చాట్ ద్వారా ఫైళ్లు పంపుకోవచ్చు, వాయిస్ మరియు వీడియో కాల్స్‌లో పాల్గొనవచ్చు. అదనంగా పంపిన మెసేజ్‌లను మార్చడం, తొలగించడం, అలాగే సందేశాలు ఆటోమేటిక్‌గా కనపడకుండా చేయడానికి ప్రత్యేక సెట్టింగులను అమర్చుకోవచ్చు. ముఖ్యంగా చాట్‌లో ఎవరైనా స్క్రీన్‌షాట్ తీసే ప్రయత్నం చేస్తే, ఆ విషయం వినియోగదారులకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.
వివరాలు
చాట్‌లు, ఫైల్ షేరింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్
ఎక్స్ అందిస్తున్న ఈ చాట్ సేవ వినియోగదారుల ప్రైవసీకి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది. చాట్‌లు, ఫైల్ షేరింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందించబడుతోంది. అంతేకాకుండా, ఈ సురక్షిత చాట్‌లలో ఎలాంటి ప్రకటనలు, ట్రాకింగ్ వంటి అంశాలు ఉండవు. దీని వల్ల వినియోగదారులకు సంపూర్ణ గోప్యత లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ iOS పరికరాలు మరియు వెబ్ వినియోగదారులకి విడుదల అవుతోంది. ఆండ్రాయిడ్ (Android) కోసం కూడా చాలా త్వరలో అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్లతో పాటుగా, ఆడియో మెసేజ్‌లు పంపడానికి ఉపయోగించే వాయిస్ మెమో ఆప్షన్‌ని కూడా ఎక్స్ అభివృద్ధి చేస్తోంది.
వివరాలు
ఎక్స్‌లో సురక్షిత మెసేజింగ్
ఈ కొత్త అప్‌డేట్‌తో ఎక్స్‌లో సురక్షిత మెసేజింగ్ మరింత ముందుకు వెళ్లినట్టైంది. ప్రకటనలు, ట్రాకింగ్ లేకుండా చాట్ చేసే అవకాశం వినియోగదారులకు నెమ్మదినిస్తుంది. మెసేజ్‌లను ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం, అదృశ్యమయ్యేలా సెట్టింగ్ పెట్టుకోవడం వంటి అవకాశాలు భద్రతా ప్రమాణాలను మరింత బలపరుస్తాయి.