Youtube: యూట్యూబ్ అకౌంట్ హ్యాక్ అయిందా? రికవరీ కోసం గూగుల్ కొత్త AI టూల్ వచ్చేసింది!
ప్రజలలో ఉన్న యూట్యూబ్‌కు ఉన్న ఆదరణ అంత ఇంతా కాదు. యూట్యూబ్ ఉచితంగా లభిస్తుండడం, రోజుకు లక్షలాది వీడియోలు అందుబాటులో వస్తుండడమే దీనికి కారణం. ఈ అదరణనే ఇప్పుడు సైబర్ నేరగాళ్లు ఆసరాగా చేసుకొని వీడియోలు క్రియేట్ చేసేవారి అకౌంట్లను హ్యాక్ చేస్తూ సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఇలా అకౌంట్లను హ్యాక్ చేయడం ఈ మధ్య సర్వసాధారణం అయిపోయింది. చేసేది లేక ఈ కంటెంట్ క్రియేటర్లు లేక కొత్త ఛానెల్‌ను క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఈ సమస్యను గుర్తించిన గూగుల్.. ఏఐ టూల్ సహాయంతో ఓ పరిష్కార మార్గంకనుగొంది.
గూగుల్ అకౌంట్,యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించిన ప్రశ్నలతో లాగిన్‌ను పునరుద్ధరిస్తుంది
సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన అకౌంట్లను రికవర్ చేసుకునేందుకు వీలుగా గూగుల్ కొత్త టూల్‌ను రూపొందించింది. గూగుల్ అకౌంట్, యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగి లాగిన్‌ను పునరుద్ధరిస్తుంది. ఒకవేళ హ్యాకర్ ఏమైనా మీ ఖాతాలలో ఏవైనా మార్పులు చేసి ఉంటే వాటిని తొలగించి పూర్వస్థితికి తీసుకొస్తుంది. ఈ టూల్ ఏఐ ఆధారిత చాట్ అసిస్టెంట్ రూపంలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు అందుబాటులోకి రానుంది. ఒకవేళ ఖాతా హ్యాక్ అయ్యిందని ఈ టూల్ నిర్ధరిస్తే.. గూగుల్ సపోర్ట్‌ను సంప్రదించకుండానే రికవర్ చేసేందుకు అనుమతి ఇస్తుంది.
ఎక్స్‌లో @TeamYouTubeను సంప్రదించి హెల్ప్ తీసుకోవచ్చు
ప్రొఫైల్ పిక్చర్, యాడ్‌సెన్స్ అకౌంట్‌లో మార్పులు సహా అన్ అర్థరైజ్డ్ వీడియోల అప్‌లోడ్ వంటి మార్గాల ద్వారా ముందుగా అకౌంట్ హ్యాకైందో.. లేదో.. నిర్ధరించుకోవాలని గూగుల్ సూచించింది. ఒకవేళ అదే నిజమైతే యూట్యూబ్ హెల్ప్ సెంటర్ ద్వారా ఈ టూల్‌ను ఉపయోగించుకొని ఖాతాను రికవర్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతానికి ఈ టూల్ ఇంగ్లీష్లో మాత్రమే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎంపిక చేసిన క్రియేటర్లకు మాత్రమే లభిస్తోంది. త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ టూల్ అవసరం ఉండి.. అందుబాటులో లేకపోతే ఎక్స్‌లో @TeamYouTubeను సంప్రదించి హెల్ప్ తీసుకోవచ్చని గూగుల్ తమ సపోర్ట్ పేజీలో తెలిపింది.