యూట్యూబ్ అలౌడ్: మీ కంటెంట్ ని ఇతర భాషల్లో ఏఐ తో డబ్బింగ్ చేసుకునే సౌకర్యం
ఈ వార్తాకథనం ఏంటి
యూట్యూబ్ లో కొత్త ఫీఛర్ వచ్చేస్తోంది. ఇక నుండి మీరు మీ కంటెంట్ ని యూట్యూబ్ సాయంతోనే ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు మీరు తెలుగులో కంటెంట్ చేస్తున్నట్లయితే ఆ కంటెంట్ ఇంగ్లీష్ లోకి ఈజీగా డబ్బింగ్ చేసుకోవచ్చు. అలౌడ్ అనే ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సాయంతో ఈ ఫీఛర్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది.
గూగుల్ ఏరియా 120 ఇంక్యుబేటర్ కు సంబంధించిన అలౌడ్ టూల్, కేవలం నిమిషాల్లోనే ఇతర భాషల నుండి దానికదే డబ్బింగ్ చేస్తుంది.
దీనివల్ల అనువాదం, వీడియో ఎడిటింగ్, ఆడియో ప్రొడక్షన్ కి కావాల్సిన సమయం తగ్గిపోతుంది. ఈ ఫీఛర్ వల్ల అటు క్రియేటర్స్ కి ఇటు ఛానల్స్ కి మంచి లాభం ఉంటుంది.
Details
అలౌడ్ ఫీఛర్ ఎలా పనిచేస్తుంది?
ఈ ఫీఛర్ ద్వారా డబ్బింగ్ చేయడానికి మూడు స్టెప్స్ ఉంటాయి. మొదటి దశలో మీ వీడియో కంటెంట్ ని ట్రాన్స్ స్రైబ్ చేస్తుంది. అంటే రాత మాదిరిగా మీ కంటెంట్ మొత్తం కనిపిస్తుంది. ఈ ప్రాసెస్ లో మీరు ఎడిట్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత కంటెంట్ ని మీరనుకున్న భాషలోకి ట్రాన్స్ లేట్ చేస్తుంది. ట్రాన్స్ లేట్ చేసాక ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బింగ్ చేయడమే.
ప్రస్తుతం అలౌడ్ టూల్, ఇంగ్లీష్ నుండి స్పానిష్, పోర్చుగీస్ భాషల్లోకి డబ్బింగ్ చేస్తుంది. మరికొన్ని రోజుల్లో చాలా భాషల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలా డబ్బింగ్ చేసిన వాయిస్ కూడా క్రియేటర్ వాయిస్ లా ఉండేందుకు యూట్యూబ్ ప్రయత్నిస్తోందట.