YouTube TV: ఆండ్రాయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ TV కొత్త ఫీచర్
ఆండ్రాయిడ్ యూజర్ల కోసం యూట్యూబ్ TV కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్‌లో యూజర్లు ఇప్పుడు మినీప్లేయర్‌ను రీసైజ్ చేయవచ్చు. ఇది కొన్ని రోజుల క్రితం యూట్యూబ్ యాప్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త మినీప్లేయర్ ఇప్పటి నుంచీ ఇన్-యాప్ పిక్చర్-ఇన్-పిక్చర్ విండోగా పనిచేయనుంది. ఈ అప్డేట్ 8.47.0 వెర్షన్‌లో భాగంగా యూట్యూబ్ TV ఆండ్రాయిడ్ డివైసుల కోసం అందుబాటులోకి వచ్చింది. మునుపటి మినీప్లేయర్ డిజైన్ యూట్యూబ్ యాప్, యూట్యూబ్ మ్యూజిక్ కంట్రోల్స్‌తో పోలిస్తే పాత స్టైల్‌లో ఉండేది. ఇది OTTOM బార్‌లో ఉన్న ఒక వెడల్పు వీడియో క్రాప్‌ను చూపించి, దానిపై ప్రోగ్రామ్ పేరు, ప్రోగ్రెస్ బార్‌ను కన్పించేలా డాక్ అవుతుండేది.
యూజర్లకు మరింత సౌకర్యవంతం
ప్లే/పాజ్ బటన్ రైట్ సైడ్‌లో ఉండేది. ఇంకా స్వైప్ లేదా ట్యాప్ చేయడం ద్వారా ఫుల్‌స్క్రీన్ మోడ్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కొత్త మినీప్లేయర్‌లో ప్లే/పాజ్ బటన్ రెండవ సైడ్‌లో 15 సెకన్ల రివిండ్స్/స్కిప్ బటన్ ఉంటుంది. దీంతో పాటు సులభంగా యాక్సెస్ చేయడానికి క్లోజ్ ఆప్షన్ కూడా ఉంది. మీరు సెంటర్ బటన్‌పై ట్యాప్ చేయడం ద్వారా మీ వీక్షణ విండోని విస్తరించవచ్చు, దీని ద్వారా మీరు మరింత ఫ్లెక్సిబిలిటీతో కంటెంట్‌ను స్క్రోల్ చేయవచ్చు. కొత్త మినీప్లేయర్‌లో పించ్-టూ-జూమ్ ఫంక్షనాలిటీ కూడా ఉంది. పాత డిజైన్‌లో చిన్న వీక్షణ విండో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే, ఇది డిఫాల్ట్‌గా చిన్న విండోగా ఉంటుంది. కానీ యూజర్ ఇష్టానుసారం మాన్యువల్‌గా సర్దుబాటు చేసుకోవచ్చు.