Page Loader
టీ20 సిరీస్‌పై టీమిండియా గురి
భారత్ టీ20 కెప్టెన్ హార్ధిక్ పాండ్యా

టీ20 సిరీస్‌పై టీమిండియా గురి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 05, 2023
02:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ అతి కష్టం మీద మ్యాచ్ ను గెలిచింది. నేడు సాయంత్రం పుణేలో రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గి సిరీస్ సాధించాలని భావిస్తోంది టీమిండియా. తొలి టీ20లో భారత్ బ్యాటింగ్‌లో తడబడింది. చివర్లో దీపక్ హుడా, అక్షర్ మెరుపులు లేకుంటే స్వల్ప స్కోర్ కే పరిమితం అయ్యేది. మొదట్లో బౌలింగ్ బాగా చేసినా బౌలర్లు.. మధ్యలో దారాళంగా పరుగులిచ్చారు. తొలి టీ20 యువ ఆటగాళ్లకు అవకాశం వచ్చింది. అయితే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. శుభ్ మన్ గిల్ 7 పరుగులకే వెనుతిరిగి నిరాశపరిచాడు. అతడు మెరుగ్గా ఆడకపోవడంతో విమర్శలు వెలువెత్తాయి. ఇచ్చిన అవకాశాన్ని సంజూశాంసన్ పూర్తిగా వినియోగించుకోలేకపోయాడు.

టీమిండియా

పుణే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం

ప్రస్తుతం సంజూ స్థానంలో రుతురాజ్, రాహుల్ త్రిపాఠిల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక సూర్యకుమార్ నుంచి పెద్ద ఇన్నింగ్స్‌‌ను అభిమానులు అశిస్తున్నారు. ఓపెనర్ ఇషాన్ కిషన్, కెప్టెన్ హార్ధిక్, హుడా, అక్షర్ పటేల్ ఫర్వాలేదనిపించారు. బౌలింగ్‌లో అరంగ్రేట్రం బౌలర్‌ శివమ్‌ మావితో పాటు ఉమ్రాన్‌ మాలిక్‌ సత్తా చాటారు. హర్షల్ పటేల్ వికెట్లు తీస్తున్నా.. ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. శ్రీలంక జట్టులో స్పిన్నర్లు హసరంగ, తీక్షణ, ధనంజయ బాగా రాణిస్తూ.. భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఇక బ్యాటింగ్లో కెప్టెన్ శనక, వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ అధ్భుతంగా ఆడుతున్నారు. నిశాంక, అసలంక రెండో టీ20 లో రెచ్చిపోతే టీమిండియాకు ఇబ్బంది తప్పదు. పుణే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది.