రిషబ్ స్థానంలో ముగ్గురు వికెట్ కీపర్లు..!
ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ ను ఓడిపోయింది. ఈ సిరీస్ లో ఇద్దరు వికెట్ కీపర్లను రంగంలోకి టీమిండియా దింపింది. కేఎల్ రాహుల్ అశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ప్రస్తుతం వన్డేలో వికెట్ కీపర్ స్థానం టీమ్ మేనేజ్ మెంట్ చాలా కష్టపడుతోంది. ప్రపంచకప్‌లో పంత్ ఆడిన 2 మ్యాచ్‌లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. రిషబ్ పంత్ వన్డేల్లో పంత్ 34.60 సగటుతో 865 పరుగులు చేశాడు. 2018లో అరంగేట్రం చేసినప్పటి నుండి, రిషబ్ కేవలం ఒక సెంచరీ చేయడం గమనార్హం. టీ20ల్లో రిషబ్ పంత్ 66 మ్యాచ్‌ల్లో 987 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లోనూ పంత్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు.
సంజుశాంసన్, ఇషాన్ కిషన్, కెఎస్.భరత్ ప్రత్యామ్నాయం కావొచ్చు
సంజుశాంసన్ 10 సంవత్సరాలుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. 138 మ్యాచ్లో 3,500 పరుగులు చేశాడు. అతను ఓపెనర్‌గా రాణించే అవకాశం టీమిండియా అతన్ని సెలెక్ట్ చేయకపోవడం శోచనీయం. ధక్షిణాఫ్రికా సిరీస్‌తో వన్డే ఆడిన సంజు 86 పరుగులు అజేయంగా నిలిచాడు. జూన్ 2022లో ఐర్లాండ్‌పై 42 బంతుల్లో 77 పరుగులు చేశాడు. పంత్‌కు ఇషాన్‌కిషన్ సరైన ప్రత్యామ్నాయం కావచ్చు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో కిషన్ 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. వన్డేలో వేగంగా డబుల్‌సెంచరీ చేసిన 7వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. కె.ఎస్.భరత్ ప్రస్తుతం ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆడిన 8 మ్యాచ్లో దాదాపుగా 200 పరుగులు చేశాడు. భవిష్యతులో భారత్ జట్టులో చోటు దక్కే అవకాశం భరత్ కు ఉండొచ్చు