Spain T10: 8బంతుల్లో 8 సిక్స్‌లు.. స్పెయిన్ టీ10 టోర్నీలో ఘటన
క్రికెట్‌లో టీ20, టీ10 ఫార్మాట్‌ల ఆవిర్భావంతో గేమ్ పూర్తిగా మారిపోయింది. ఈ పొట్టి ఫార్మాట్‌లలో బ్యాటర్‌లదే హవా కొనసాగుతోంది. బౌండరీలు, సిక్సుల వర్షంతో అభిమానులను మంత్ర ముగ్దులను చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా, స్పెయిన్ టీ10 టోర్నీలో ఓ బ్యాటర్ 8 బంతుల్లో 8 సిక్సులు బాది సంచలనం సృష్టించాడు. ఈ ఘట్టానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్పెయిన్ టోర్నీలో అలీ హసన్ సూపర్ షో
మోంట్‌జుక్ ఒలింపిక్ గ్రౌండ్‌లో యునైటెడ్ సీసీ గిరోనా, పాక్ బార్సిలోనా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ బార్సిలోనా ఆటగాడు అలీ హసన్ అసాధారణ ప్రదర్శన చేశాడు. 6.1 ఓవర్లకు 113/4 స్కోరుతో నిలిచిన పాక్ బార్సిలోనా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో అలీ హసన్ క్రీజులోకి వచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. ఎనిమిది బంతుల్లో ఎనిమిది సిక్సులు హసన్, ఏడో ఓవర్ రెండో బంతి నుంచి వరుసగా ఐదు సిక్సులు బాదాడు.ఆ తర్వాత ఎనిమిదో ఓవర్‌లో 2, 3, 4 బంతులకు కూడా సిక్సులు కొట్టాడు.ఈ దెబ్బతో వరుసగా 8 బంతుల్లో 8 సిక్సులు నమోదయ్యాయి.
పాక్ విజయం
మొత్తం 16 బంతుల్లో 55 పరుగులు చేసిన హసన్ తన ఇన్నింగ్స్‌లో 8 సిక్సులు, 1 ఫోర్ నమోదు చేశాడు. అలీ హసన్ దూకుడు బ్యాటింగ్‌తో పాక్ బార్సిలోనా నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్లకు 194 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో యునైటెడ్ సీసీ గిరోనా జట్టు 9.4ఓవర్లలో కేవలం 95పరుగులకే ఆలౌట్ అయింది. ఇతర క్రికెట్ ఫార్మాట్‌లలో ఒకే ఓవర్లో 6 సిక్సుల రికార్డులు మాత్రమే ఉన్నాయి.యువరాజ్ సింగ్, కీరన్ పోలార్డ్, హర్షల్ గిబ్స్, రవిశాస్త్రి వంటి వారు ఈ ఘనత సాధించారు. అయితే 8 బంతుల్లో 8 సిక్సులు బాదడం మాత్రం క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.ఈ ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచం మరోసారి అలీ హసన్ ప్రతిభను గమనించింది.