తన వైపు నుంచి సీఎస్కేకు పెద్ద బహుమతి.. రిటైర్మెంట్‌పై ధోనీ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచులో గుజరాత్ పై చైన్నై విజయం సాధించి కప్పును ఎగరేసుకొనిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోవ ప్రీమియర్ లీగ్ టైటిల్ కైవసం చేసుకున్న జట్టుగా చైన్నై నిలిచింది.
అత్యధిక ఐపిఎల్ టైటిల్స్ సాధించిన రోహిత్ శర్మ రికార్డును ధోని సమం చేశాడు.
మ్యాచ్ అనంతరం ధోని తన రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. తనవైపు నుంచి చైన్నై సూపర్ కింగ్స్ కు ఓ బహుమతి అంటూ ధోనీ పేర్కొన్నారు.
తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని, ఈ ఏడాది తాను ఎక్కడ ఉన్నా అభిమానులు తనపై చూపించిన ప్రేమ, అప్యాయత మర్చిపోలేనని గుర్తు చేశాడు.
Details
రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆరు నెలలు సమయం
తనకు చాలా కష్టమైన విషయం ఏమిటంటే మరో 9 నెలలు కష్టపడి కనీసం వచ్చే సీజన్ లోనైనా ఆడాలని, ఇదంతా తన శరీరంపై ఆధారపడి ఉందని, రిటైర్మెంట్ విషయం నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఆరు నెలల సమయం ఉందని, ఐపీఎల్ టైటిల్ ను తమ జట్టు సభ్యులు బహుమతి ఇవ్వడంతో తాను చేయాల్సిన బాధ్యతలున్నాయని అనిపిస్తోందని ధోని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని అందరి దృష్టిని అకర్షించాడు. మొత్తం ఐపీఎల్, ఫైనల్ మ్యాచ్ కూడా ధోనీ మేనియాతో దద్దరిల్లింది.
అయితే ధోని వచ్చే ఏడాది మరోసారి చైన్నై సూపర్ కింగ్స్ కి నాయకత్వం వహిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.