ఐపీఎల్ ట్రోఫీ విజేతగా చైన్నై సూపర్ కింగ్స్.. ఫైనల్లో గుజరాత్ ఓటమి
ఉత్కంఠ భరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాదించింది. గుజరాత్ పై ఐదు వికెట్ల తేడాతో గెలుపొంది ఐదో టైటిల్ ను చైన్నై సొంతం చేసుకుంది. చివరి ఓవర్లో పదమూడు పరుగులు కావాల్సి ఉండగా లాస్ట్ రెండు బాల్స్ కు సిక్స్, ఫోర్ కొట్టి చైన్నైకి జడేజా విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ 47 బంతుల్లో(8 ఫోర్లు, 6 సిక్సర్లు) 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. సాహా(54) అర్ధ సెంచరీతో రాణించడంతో గుజరాత్ భారీ స్కోరును చేసింది.
కాన్వే, గైక్వాడ్ మెరుపులు
డక్ వర్త్ లూయిస్ ప్రకారం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎక్కే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు గైక్వాడ్, కాన్వే తొలి వికెట్ కు 70 రన్స్ అందించిన అద్భుతమైన స్టార్ట్ ను అందించాడు. గైక్వాడ్ 26, కాన్వే 47, రహానే 19, శివందూబే 32*, జడేజా 16* రన్స్ చేశారు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతులు మూడు పరుగులే వచ్చాయి. చివరి రెండు బంతులో జడేజా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి చైన్నైకి విజయాన్ని అందించాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు, నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశారు.