IPL 2023 ఫైనల్లో భారీ వర్షం.. నిలిచిన ఆట
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కి వరుణుడు మళ్లీ అడ్డొచ్చాడు. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ తర్వాత మొదట చిరుజల్లులు పడగా.. తర్వాత తగ్గింది. దీంతో చైన్నై సూపర్ కింగ్స్ ఆట కాస్త ఆలస్యంగా మొదలైంది.
అయితే తొలి ఓవర్లో 3 బంతులు పడగానే మళ్లీ భారీ వర్షం కురిసింది.
నెమ్మదిగా మొదలైన వర్షం మళ్లీ భారీ స్థాయికి చేరడంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు. తొలి ఇన్నింగ్స్ లో గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది.
గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ 45 బంతుల్లో (8ఫోర్లు, 6 సిక్సర్లు) 96 పరుగులతో విరుచుకుపడ్డారు. అతని తోడు సాహా (54) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ భారీ స్కోరును సాధించింది.
Details
మ్యాచ్ రద్దు అయితే గుజరాత్ టైటాన్స్ కే కప్పు
ప్రస్తుతం పిచ్ ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్ ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు ప్రకటన చేస్తామని చెప్పారు. ఒకవేళ ఫైనల్లో వర్షం కారణంగా ఓవర్లు తగ్గించాల్సి వస్తే చైన్నై టార్గెట్ ఇలా ఉండనుంది.
19 ఓవర్లకు 207, 18 ఓవర్లకు 198, 17 ఓవర్లకు 190, 16 ఓవర్లకు 181, 15 ఓవర్లకు 171, 14 ఓవర్లకు 162, 13 ఓవర్లకు 153, 12 ఓవర్లకు 143, 11 ఓవర్లకు 133, 10 ఓవర్లకు 123, 6 ఓవర్లకు 78, 5 ఓవర్లకు 66 రన్స్ చేయాల్సి ఉంటుంది.
ఒకవేళ మ్యాచ్ రద్దు అయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కే టైటిల్ దక్కనుంది.