IPL 2023 : ఇవాళ కూడా వర్షం పడితే ఆ జట్టే టైటిల్ విజేత.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచును రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో రిజర్వేడ్ అయిన మే 29 సోమవారానికి మ్యాచును పోస్ట్ పోన్ చేశారు. నేటి రాత్రి 7:30గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
అయితే సోమవారం కూడా అహ్మదాబాద్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు అయినా మ్యాచ్ ప్రారంభమయ్యేనా అని క్రికెట్ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ సోమవారం కూడా వర్షం వల్ల ఆట పూర్తిగా నిలిచిపోతే ఐపీఎల్ పాయింట్స్ టేబుల్ లో టాప్ లో నిలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టును విజేతగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Details
సూపర్ ఓవర్ ద్వారా విజేతను ప్రకటించే అవకాశం!
ఐపీఎల్ నిబంధనల ప్రకారం టాస్ పడిన తర్వాత కూడా వర్షం పడితే కనీసం ఐదు ఓవర్లు మ్యాచ్ అయినా నిర్వహిస్తారు. ఒకవేళ వర్షం అడ్డంకితో టాస్ పడకుండా రాత్రి 11 గంటలు దాటితే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచును నిర్వహిస్తారు.
ఒక వేళ సూపర్ ఓవర్ కూడా నిర్వహించని పక్షంలో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న గుజరాత్ జట్టును ఐపీఎల్ 2023 విన్నర్‌గా ప్రకటించనున్నారు. ఇలా ప్రకటిస్తే చైన్నై అభిమానులకు భారీ షాక్ తప్పదు.
నేటి రాత్రి జరిగే ఫైనల్ మ్యాచుకు వర్షం అడ్డంకి ఉండకూడదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.