IPL 2023 Final: ఫైనల్లో ఎంఎస్ ధోని Vs హార్ధిక్ పాండ్యా.. ట్రోఫీ విజేత ఎవరో!
రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ఫైనల్లో గుజరాత్ టైటాన్స్, చైన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండో సీజన్‌లో కూడా ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం సాయంత్రం 7: 30గంటలకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సీఎస్కే 10 సార్లు ఫైనల్ కు చేరింది. ఐపీఎల్‌లో 61.28శాతం సీఎస్కే అత్యధిక విజయాల రికార్డును కలిగి ఉంది. ఈ సీజన్లో గుజరాత్ నెంబర్ 2 జట్టుగా ఉండటమే కాకుండా నంబర్ 1 జట్టుగా ఫ్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ మ్యాచులో ముంబై ఇండియన్స్‌ను గుజరాత్ టైటాన్స్ చిత్తు చేసింది.
ఐపీఎల్ ట్రోఫీపై కన్నేసిన ఇరు జట్లు
సీఎస్కే తో జరిగిన తొలి క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్ ఓడిపోయింది. తొలి క్వాలిఫయర్ మ్యాచులో చైన్నై 172 పరుగులు చేయగా.. హార్ధిక్ సేన 157 పరుగులే చేసి ఓటమిపాలైంది. ధోనీ సారథ్యంలోని సీఎస్కే ఐదోసారి ఛాంపియన్ గా నిలుస్తుందా?లేక గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఛాంపియన్ అవుతుందా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. శుభ్‌మాన్ గిల్ ఈ సీజన్లో మూడు సెంచరీ చేసి భీకర ఫామ్‌లో ఉన్నాడు. తొలి క్వాలిఫయర్‌లో చైన్నై చేతిలో దెబ్బతిన్న గుజరాత్.. చైన్నైని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది.