LOADING...
Team India: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో అరుదైన ఘట్టం.. చరిత్రలో నిలిచే సీన్!
భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో అరుదైన ఘట్టం.. చరిత్రలో నిలిచే సీన్!

Team India: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో అరుదైన ఘట్టం.. చరిత్రలో నిలిచే సీన్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ సూపర్‌-8 దశలో జింబాబ్వేపై టీమిండియా అసలైన బ్యాటింగ్ తుఫాన్ సృష్టించింది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఏకంగా 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేసి ప్రత్యర్థిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో ఆరుగురు భారత బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం విశేషం. 150కి పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేసిన భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ప్రతి బ్యాటర్ దూకుడైన ఆటతీరుతో జింబాబ్వే బౌలర్లను మట్టికరిపించాడు.

Details

150+ స్ట్రైక్‌రేట్‌తో ముగ్గురు

సంజూ శాంసన్ - 24 (15), స్ట్రైక్‌రేట్ 160.00 అభిషేక్ శర్మ - 55 (30), స్ట్రైక్‌రేట్ 183.33 ఇషాన్ కిషన్ - 38 (24), స్ట్రైక్‌రేట్ 158.33 210+ స్ట్రైక్‌రేట్‌తో ముగ్గురు సూర్యకుమార్ యాదవ్ - 33 (13), స్ట్రైక్‌రేట్ 253.85 హార్దిక్ పాండ్యా - 50* (23), స్ట్రైక్‌రేట్ 217.39 తిలక్ వర్మ - 44* (16), స్ట్రైక్‌రేట్ 275.00 ప్రత్యేకంగా తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుత వేగంతో పరుగులు సాధిస్తూ డెత్ ఓవర్లలో స్కోరును భారీగా పెంచారు.

Details

పవర్‌ప్లే నుంచే దూకుడు

ఓపెనర్లు వేగంగా ఆరంభం ఇవ్వడంతో టీమిండియా రన్‌రేట్ పవర్‌ప్లే నుంచే 10కు పైగా కొనసాగింది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై కూడా ఎటువంటి వెనుకంజ వేయకుండా దాడి కొనసాగించడంతో మ్యాచ్ పూర్తిగా భారత జట్టుకు అనుకూలమైంది. డెత్ ఓవర్లలో పరుగుల వర్షం చివరి ఐదు ఓవర్లలో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ జంట విరుచుకుపడి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించింది. ప్రతి ఓవర్‌లో 15 నుంచి 20 పరుగుల వేగంతో స్కోరు పెరిగి ప్రత్యర్థికి అందనంత దూరంలోకి వెళ్లింది.

Advertisement

Details

బౌలింగ్‌లోనూ అదిరిన భారత్.. కానీ

256 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడే క్రమంలో భారత బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ మ్యాచ్‌ను 72 పరుగుల తేడాతో ముగించారు. ఈ విజయం నెట్ రన్‌రేట్ పరంగా కూడా భారత్‌కు గణనీయమైన లాభం చేకూర్చింది. అయితే శివం దుబే మాత్రం నిరాశపరిచే బౌలింగ్ ప్రదర్శించాడు. ఒకే మ్యాచ్‌లో ఆరుగురు బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్‌రేట్ నమోదు చేయడం అరుదైన ఘట్టం. సూపర్‌-8లో సాధించిన ఈ విధ్వంసకర విజయం టీమిండియాకు సెమీఫైనల్ దిశగా బలమైన అడుగుగా నిలిచింది. బ్యాటింగ్ లోతు, ఫినిషింగ్ శక్తి, అగ్రెసివ్ ఆట - ఇవన్నీ కలిసొచ్చినప్పుడు భారత్ ఎంత ప్రమాదకరమో ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది.

Advertisement