బిగ్‌బాష్ లీగ్‌లో ఆరోన్ పింఛ్ అద్భుత ఘనత
బిగ్‌బిష్ లీగ్‌లో ఆరోన్ ఫించ్ అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌లో 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 54 బంతుల్లో 63 పరుగులతో ఈ అద్భుతమైన ఫీట్‌ను సాధించాడు. దీంతో రెనెగేడ్స్‌కు ఆరు వికెట్ల విజయాన్ని అందించింది. మెల్‌బోర్న్‌లోని డాక్‌ల్యాండ్స్ స్టేడియంలో 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రెనెగేడ్స్.. 16 పరుగులు చేసి 3 వికెట్లను నష్టపోయింది. బిబిఎల్ లీగ్ లో 1000 పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. 25 మ్యాచ్‌లు ఆడిన ఫించ్ 58.66 సగటుతో 1,056 పరుగులతో రికార్డు క్రియేట్ చేశాడు.
ఫించ్ సాధించిన రికార్డులివే..
మోయిసెస్ హెన్రిక్స్ (933), డేనియల్ హ్యూస్ (927), జోష్ ఫిలిప్ (912) మాత్రమే ఈ జాబితాలో 900 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఫించ్ ప్రస్తుతం 101 గేమ్‌లలో 35.54 సగటుతో 3,235 పరుగులతో BBL చరిత్రలో రెండవ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. ఇందులో 26 అర్ధశతకాలు, రెండు సెంచరీలున్నాయి. రెనెగేడ్స్ తరఫున స్పిన్నర్ ఫవాద్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు.