Page Loader
Abhishek Sharma: కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!
కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!

Abhishek Sharma: కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 23, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి (3/23), అక్షర్‌ పటేల్‌ (2/22)దెబ్బకు 20 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్‌ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ లక్ష్యాన్ని భారత్ కేవలం 12.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా ఛేదించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (79; 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శనతో సిక్సర్ల వర్షం కురిపించాడు.

వివరాలు 

 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ 

తొలి టీ20 మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌పై టీమిండియా తరఫున రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచిన అభిషేక్, సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రికార్డును అధిగమించాడు. 2018లో మాంచెస్టర్‌లో జరిగిన టీ20లో రాహుల్ 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్‌లో యువరాజ్ 12 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసి, ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది అరుదైన రికార్డు నెలకొల్పాడు.

వివరాలు 

అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డు

తొలి టీ20లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డును సాధించాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (97) పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు ముందు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ (96 వికెట్లు) పేరిట ఉండేది. చహల్ 79 ఇన్నింగ్స్‌లలో 96 వికెట్లు తీసినప్పటికీ, అర్ష్‌దీప్ కేవలం 61 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో హార్దిక్ పాండ్యా (91 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (90 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (89 వికెట్లు) తదుపరి స్థానాల్లో ఉన్నారు.