డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా తుది జట్టు ఇదేనన్న కమిన్స్.. లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?
టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రేపటి నుంచి వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా తరుపున ఎవరెవరు బరిలోకి దిగనున్నారో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ చెప్పేశాడు. గాయం కారణంగా దూరమైన జోష్ హేజిల్ వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ ను జట్టులోకి తీసుకున్నట్లు తెలిపాడు. ఇప్పటివరకూ 7 టెస్టులాడిన బోలాండ్ 13.42 సగటుతో 28 వికెట్లు తీశాడు. బోలాండ్ ప్రాక్టీస్ సెషన్ లోనూ అద్భుతంగా రాణించాడని, ప్రతి బంతికి వికెట్లు తీయాలని బౌలర్లు అశిస్తారని, ఓపిగ్గా ఎదురుచూస్తే వికెట్లు వస్తాయని కమిన్స్ పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే!
ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ విభాగంలో కమిన్స్, స్టార్క్ తో పాటు బోలాండ్ ఉండనున్నాడు. స్పిన్నర్ గా నాథన్ లియాన్ ఒక్కడే ఆస్ట్రేలియా తరుపున బరిలోకి దిగనున్నాడు. ఇక డేవిడ్ వార్నర్‌తో కలిసి ఉస్మాన్ ఖావాజా ఓపెనింగ్ చేయనున్నాడు. ఓపెనర్ల తర్వాత లబుషేన్, స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కేరీ దిగనున్నారు. ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, ట్రావిడ్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నేథన్ లయన్, స్కాట్ బోలాండ్