Page Loader
రోహిత్ శర్మ ఎఫెక్ట్.. ట్విట్టర్, ఇన్‌స్టాలో MIను వీడిన 8లక్షలకు పైగా ఫ్యాన్స్ 
రోహిత్ శర్మ ఎఫెక్ట్.. ట్విట్టర్, ఇన్‌స్టాలో MIను వీడిన 8లక్షలకు పైగా అవుతున్నఫ్యాన్స్

రోహిత్ శర్మ ఎఫెక్ట్.. ట్విట్టర్, ఇన్‌స్టాలో MIను వీడిన 8లక్షలకు పైగా ఫ్యాన్స్ 

వ్రాసిన వారు Stalin
Dec 16, 2023
06:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 17వ సీజన్ కోసం దుబాయ్‌లో డిసెంబర్ 19న మినీ వేలం నిర్వహించనుంది. ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ముంబై ఇండియన్స్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అభిమానులు యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత ముంబై ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాలను రోహిత్ అభిమానులు అన్‌ఫాలో అవుతున్నారు.

ముంబై

ఇన్‌స్టాలో నాలుగు లక్షలు.. ట్విట్టర్‌లో నాలుగు లక్షలు అన్ ఫాలో

ముంబై ఇండియన్స్‌కు ఇన్‌స్టాలో 13.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు రోహిత్‌ను తప్పించిన తర్వాత ఫాలోవర్ల సంఖ్య 12.7 మిలియన్లకు చేరింది. ఈ లెక్కన శనివారం ఒక్కరోజే ముంబై ఇన్‌స్టాగ్రామ్‌ నాలుగు లక్షల మంది వీడారు. రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ముంబయికి ట్విట్టర్‌లో 8.6మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ఇప్పుడు 8.2 మిలియన్లకు తగ్గింది. దాదాపు 4 లక్షల మంది ముంబయి ఫ్రాంచైజీని అన్ ఫాలో అయ్యారు. అలాగే రోహిత్‌ను తప్పిస్తూ.. ప్రకటన చేయడంపై సోషల్ మీడియాలో ఫాన్స్ రకరకాలు పోస్టులు పెడుతున్నారు. ముంబయి ఇండియన్స్‌ నుంచి ఇలాంటి ప్రకటన ఊహించలేదని, ఎప్పూడూ రోహిత్‌నే తమ ఫేవరెట్‌ అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.