LOADING...
T20 WC 2026: జింబాబ్వే తర్వాత ఒమన్.. ఆసీస్‌కు వరుస అవమానాలు
జింబాబ్వే తర్వాత ఒమన్.. ఆసీస్‌కు వరుస అవమానాలు

T20 WC 2026: జింబాబ్వే తర్వాత ఒమన్.. ఆసీస్‌కు వరుస అవమానాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 20, 2026
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-బి పోటీలు ఆసక్తికరంగా సాగాయి. తొలుత ఐర్లాండ్‌పై విజయం సాధించిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత అనూహ్యంగా జింబాబ్వే చేతిలో పరాజయం పాలైంది. అనంతరం శ్రీలంక జట్టు చేతిలోనూ ఓడిపోయి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ దశలో చివరి నామమాత్రపు మ్యాచ్‌గా శుక్రవారం (AUS vs OMA)తో ఆసీస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు శ్రీలంకలోని పల్లెకిలా స్టేడియం వేదికగా నిలవనుంది. మ్యాచ్‌కు ముందు ఒమన్ కెప్టెన్ జతీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఓడించడం తమకు మంచి అవకాశమని పేర్కొన్నాడు.

Details

టీ20 ఫార్మాట్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేం

ఈ మ్యాచ్‌లో మేము గెలిచే అవకాశాలు శాతం వంద ఉన్నాయి. టీ20 ఫార్మాట్‌లో ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కష్టం. సరైన సమయంలో మెరుగైన ప్రదర్శన చేసే జట్టుకే విజయం దక్కుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మంచి ఫామ్‌లో లేదు. వాళ్లు మొమెంటమ్ కోల్పోయారు. ఇలాంటి సమయంలో వారిని ఓడించడం సాధ్యమే. మా జట్టు పూర్తిగా సానుకూల దృక్పథంతో ఉంది. ఆసీస్‌పై మా ముద్ర వేయాలని అందరం ఎదురుచూస్తున్నామని జతిందర్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటికే జింబాబ్వే వంటి పసికూన చేతిలో ఓడిన ఆసీస్‌కు.. మరో పసికూన జట్టు కెప్టెన్ కూడా బహిరంగంగా సవాలు విసరడం చర్చనీయాంశమైంది.

Details

ఇకనైనా గౌరవంగా ఆడాలంటూ చురకలు

దీంతో ఆసీస్ అభిమానులు సోషల్ మీడియాలో "ఇది ఘోర అవమానం.. ఇకనైనా గౌరవంగా ఆడండి అంటూ కెప్టెన్ మార్ష్ బృందానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్-బిలో ఒమన్ ఇప్పటికే జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. 2024 ఎడిషన్‌లో కూడా ఆసీస్ చేతిలో పరాజయం పాలైంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటామని ఒమన్ శిబిరం ఆశాభావంతో ఉంది.

Advertisement