Shoaib Akhtar: అసమర్థుడిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు.. పీసీబీ ఛైర్మన్‌పై అక్తర్ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగాఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నీలో ఆదివారం కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన కీలక పోరులో పాకిస్థాన్ పూర్తిగా తేలిపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి ముగింపు వరకు ఏ దశలోనూ పాక్ జట్టు భారత్‌కు సవాలు విసరలేకపోయింది. పోరు పూర్తిగా ఏకపక్షంగా సాగడంతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ బౌలర్ షోయాబ్ ఆక్తర్ తీవ్రంగా స్పందించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించాడు. జట్టు వరుస వైఫల్యాలకు బోర్డు విధానాలే కారణమని ఆరోపించాడు.
Details
సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లో లేరు
సీనియర్ ఆటగాళ్లు అయిన బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ వరుసగా నిరాశాజనక ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ వారిని జట్టులో కొనసాగించడం ఎందుకని ప్రశ్నించాడు. అతడికి తాను పీసీబీ ఛైర్మన్ అన్న విషయం గుర్తుందా? ఏమీ తెలియని వ్యక్తిని ఆ బాధ్యతలో పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టు ఎలా ముందుకు సాగుతుంది? ఒకరిని సూపర్‌స్టార్ అని చెప్పుకుంటున్నారు. కానీ అతడు ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోయాడంటూ అక్తర్ మండిపడ్డాడు. సామర్థ్యం లేని వ్యక్తులకు ఉన్నత బాధ్యతలు అప్పగిస్తే దేశ వ్యవస్థే దెబ్బతింటుందని అక్తర్ హెచ్చరించాడు.
Details
సూపర్-8 దశకు భారత్ అర్హత
సామర్థ్యం లేని వ్యక్తి ఉన్నత స్థానంలో ఉంటే దేశాన్ని నాశనం చేస్తాడు. వ్యవస్థను కూలదోస్తాడు. దానికి ఉదాహరణ మీ ముందే ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకే అర్థమవుతుందంటూ నఖ్వీపై చురకలంటించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, ఈ విజయంతో టీమ్‌ఇండియా సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయాలు నమోదు చేసి అజేయంగా కొనసాగుతోంది.