
IPL 2023: చివర్లో అక్షర పటేల్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ను ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన లక్నో ఓపెనర్లు పృధ్వీషా, కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు శుభారంభాన్ని అందించలేదు. పృధ్వీషా(15) మళ్లీ చెత్త షాట్ తో పెవిలియానికి చేరాడు.
అనంతరం క్రీజులోకి దిగిన యస్ దుల్(4), రోమన్ పవర్ వెల్ (4), లలిత్ యాదవ్ (2) వరుసగా ఔట్ అయ్యారు. దీంతో 86 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది.
కెప్టెన్ డేవిడ్ వార్నర్, అక్షర్ పటేల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
వార్నర్
హాఫ్ సెంచరీ చేసిన వార్నర్
వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొట్టి స్కోరును పరిగెత్తించారు.ఈ క్రమంలో వార్నర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరి మార్క్ ను దాటుకున్నాడు.
అక్షర పటేల్ 25 బంతుల్లో (4 ఫోర్లు, 5 సిక్సర్లు) 54 పరుగులతో విజృంభించాడు. వార్నర్ 47 బంతుల్లో 6 ఫోర్లు సాయంతో 51 పరుగులు చేశాడు.
ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్ 3, పీయిష్ చావ్లా 3, మెరిడిత్ 2 వికెట్లు సాధించారు. నిర్ణీత 19.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఢిల్లీ ఆలౌటైంది.