LOADING...
T20 WC 2026: అందరి చూపు ఈ నాలుగు జట్లపైనే.. హాట్‌టాపిక్‌గా సెమీస్‌ సమరం!
అందరి చూపు ఈ నాలుగు జట్లపైనే.. హాట్‌టాపిక్‌గా సెమీస్‌ సమరం!

T20 WC 2026: అందరి చూపు ఈ నాలుగు జట్లపైనే.. హాట్‌టాపిక్‌గా సెమీస్‌ సమరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్‌-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభంకానున్నాయి. దీంతో ఏ జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ క్రికెట్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్‌ మీడియాలో అభిమానులు తమ తమ అంచనాలను పంచుకుంటుండగా, తాజాగా స్టార్‌ స్పోర్ట్స్‌ నిపుణులు కూడా తమ ఫేవరెట్‌ జట్లను ప్రకటించారు. స్టార్‌ స్పోర్ట్స్‌ ప్యానెల్‌లో టీమిండియా మాజీ క్రికెటర్లు యుజేంద్ర చాహల్, చతేశ్వర్ పుజారా, కైఫ్, వరుణ్ అరోన్, సబా కరీం, సంజయ్ బంగర్ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు వేర్వేరు అంచనాలు వెల్లడించినా, అందరిలో ఒక కామన్‌ పాయింట్‌ మాత్రం స్పష్టంగా కనిపించింది అది టీమిండియా. ఈ ఆరుగురు నిపుణులూ భారత్‌ సెమీస్‌కు చేరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Details

ఎవరి అంచనాలు నిజమవుతాయో తెలియాలంటే కొంతకాలం అగాల్సిందే

చహల్‌ అంచనాల ప్రకారం భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. పుజారా భారత్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకకు అవకాశం ఇచ్చాడు. మొహమ్మద్‌ కైఫ్‌ కూడా భారత్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌లను ఫైనల్‌ ఫోర్‌లో చూస్తున్నాడు. అయితే వరుణ్‌ ఆరోన్‌ మాత్రం భిన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతని అంచనాల ప్రకారం భారత్‌తో పాటు వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌, పాకిస్థాన్ సెమీస్‌కు చేరతాయి. సబా కరీం భారత్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లకు ఛాన్స్‌ ఇచ్చాడు. మరోవైపు సంజయ్‌ బాంగర్‌ భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్‌ సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. మరి ఈ నిపుణుల అంచనాల్లో ఎవరిది నిజమవుతుందో చూడాలి.

Advertisement