Loading...
IND vs SL Result: 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..
124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..

IND vs SL Result: 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై భారత్ ఘన విజయం.. పాక్‌తో తుదిపోరు..

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 01, 2026
12:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల క్రికెట్‌లో భారత్ దూసుకెళ్లింది. సెమీఫైనల్లో శ్రీలంకను ఏకంగా 124 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు.. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో స్వర్ణ పతకం కోసం జరిగే తుదిపోరులో పాకిస్థాన్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. మరో సెమీఫైనల్లో పాకిస్థాన్ 6 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. నిషిన్‌లో జరిగిన సెమీఫైనల్‌లో టాస్ కోల్పోయిన భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అజేయంగా 80 పరుగులు చేసి జట్టు స్కోరును పటిష్ఠ స్థాయికి తీసుకెళ్లాడు.

వివరాలు 

శ్రీలంక 9.5 ఓవర్లలో 45 పరుగులకే అల్ ఔట్ 

వైభవ్ సూర్యవంశీ కూడా ధాటిగా బ్యాటింగ్ చేస్తూ 21 బంతుల్లో 38 పరుగులు సాధించాడు.

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

వరుసగా వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థి బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.

చివరకు శ్రీలంక 9.5 ఓవర్లలో కేవలం 45 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 124 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

వివరాలు 

భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ విఫలం 

భారత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.

ఆ జట్టు నుంచి ఏకంగా ఆరుగురు బ్యాటర్లు కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు.

ఈ విజయంతో భారత్ సియా క్రీడల క్రికెట్‌లో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.

మరోవైపు పాకిస్థాన్ కూడా సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించడంతో.. ఫైనల్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శ్రీలంకను ఓడించిన భారత్

ADVERTISEMENT