Page Loader
పీఎస్‌ఎల్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజమ్
టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్‌గా బాబర్

పీఎస్‌ఎల్‌లో సెంచరీతో చెలరేగిన బాబర్ ఆజమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 09, 2023
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

షెషావర్ జల్మీ, క్వెటా గ్లాడియేటర్స్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఫెషావర్ జల్మీ ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో పెషావర్ జెల్మీ కెప్టెన్ బాబార్ ఆజమ్ సెంచరీతో చెలరేగిపోయాడు. 60 బంతుల్లో సెంచరీ బాదిన బాబర్, టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో ప్లేయర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ టీ20 ఫార్మాట్లో 22 సెంచరీలు చేయగా.. బాదర్ ఎనిమిది టీ20 సెంచరీలు చేశాడు. పెషావర్‌ను 20 ఓవర్లలో 240/2 భారీ స్కోరును చేసింది. క్వెట్టా గ్లాడియేటర్స్ టీమ్‌ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఈ లక్ష్యాన్ని ఊది పాడేసింది.

క్వెట్టా గ్లాడియేటర్స్

క్వెట్టా గ్లాడియేటర్స్ విజయం

సయిం అయూబ్ 74 పరుగులు చేయగా , రోవ్‌మన్ పావెల్ 35 పరుగులు చేశాడు. 65 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 115 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ రనౌట్ అయ్యాడు క్వెట్టా గ్లాడియేటర్స్ తరుపున ఇంగ్లాండ్ ఓపెనర్ జాసన్‌రాయ్ 145 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మార్టిన్ గుప్టిల్ 8 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేయడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ విజయాన్ని నమోదు చేసింది. 2012లో టీ20లో అరంగేట్రం చేసిన బాబర్ ఈ ఫార్మాట్‌లో 8,892 పరుగులను చేశాడు. షోయబ్ మాలిక్ (12,528) తర్వాత ఈ ఫార్మాట్‌లో పాకిస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా బాబర్ నిలిచాడు.