బాబర్‌ను విడిచే ప్రసక్తే లేదు : షోయబ్ అక్తర్
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్న పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ జట్టు సారిథి బాబర్ ఆజమ్‌కు ఇంగ్లీష్ రాదని, ఆతడికి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని, అందుకే బ్రాండ్ కాలేకపోయాడనికి గతంలో షోయబ్ చేసిన విమర్శలు మరోసారి పెద్ద దూమారం అయ్యాయి. తన కోచింగ్ రోజులలో నెట్స్‌లో బాబర్‌తో జరిగిన ఓ ఘటనను ఆక్తర్ గుర్తు చేసుకున్నాడు. బాబర్ అకాడమీకి వచ్చే రోజుల్లో ముదస్సర్ బాయ్ తో వచ్చేవాడని, తన బౌలింగ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడోద్దని బాబర్ కి చెప్పానని, అయినా వినకుండా స్ట్రెయిట్ డ్రైవ్ ఆడానని, అప్పుడు తాను బాబర్ విడిచి పెట్టకూడదని అనుకున్నానని ఆక్తర్ వెల్లడించారు.
అవార్డులు గెలుచుకుంటే సూపర్ స్టార్లు కారు
అనంతరం బాబర్ కు ఐసీసీ అవార్డులు రావడం గురించి ఆక్తర్ స్పందిస్తూ... 'వసీం అక్రమ్, వకార్ యూనిస్, షాహిది అఫ్రిది, అబ్దుల్ రజాక్ లు ఆడేప్పుడు ప్రేక్షకులు తన వాళ్లు అనుకునే వాళ్లు అని , ఆట అనేది వాళ్లని నిశ్శబ్దంగా కూర్చునేలా చేసిందని, అందుకోసమే వాళ్లు సూపర్ సార్ట్ అయ్యారని చెప్పారు. అంతేగానీ ఐసీసీ అవార్డులు గెలిచినంత సూపర్ స్టార్లు కారని, బాబర్ కూడా ఈ విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అనంతరం పీఎస్ఎల్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ తరఫున ఆడుతున్న ఆజమ్ ఖాన్ పై అక్తర్ ప్రశంసలు కురిపించాడు.