PSL: వావ్.. సూపర్ మ్యాన్‌లా బంతిని ఆపిన సికిందర్ రాజా
ఒకప్పుడు అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్‌లు పట్టే ఆటగాళ్లు ఎవరంటే టక్కున గుర్తొచ్చే ప్లేయర్లలో తొలి ఆటగాడు జాంటీ రూడ్స్.. ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనా అని చెప్పేవాళ్లు. కొంతమంది ఆటగాళ్లు బౌండరీ లైన్ల మధ్య అద్భుతమైన క్యాచ్‌లు పడుతూ ఔరా అనిపిస్తుంటారు. సిక్సర్ వెళ్లకుండా బంతిని పట్టుకొని కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటారు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ క్వాలండర్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ వెళ్లకుండా గాల్లో ఎగిరి బంతిని ఆపిన వీడియో ప్రస్తుతం ప్రేక్షకుల్ని కట్టి పడేస్తోంది. జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికందర్ రాజా ప్రత్యర్థి బ్యాట్‌మెన్ సమిద్ కొట్టిన బంతి సిక్సర్ వెళ్లకుండా బంతిని ఆపాడు.
పాయింట్ల పట్టికలో లాహోర్ జట్టు అగ్రస్థానం
అదే విధంగా సికిందర్ బ్యాటింగ్‌లోనూ రెచ్చిపోయాడు. క్వెటా గ్లాడియేటర్స్‌తో ఆకాశమే హద్దు చెలరేగిపోయారు. కేవలం 34 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. దాంతో లాహోర్ జట్టు 148 పరుగులు చేసింది. అనంతరం గ్లాడియేటర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసింది. హారీస్ రవూఫ్ 3 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లతో మెరిశాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లాహోర్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సికిందర్ రాజాను రూ 50 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది