క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన కమ్రాన్ అక్మల్
పాకిస్థాన్ వికెట్ కీపర్-బ్యాటర్ కమ్రాన్ అక్మల్ అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవలే జాతీయ సెలక్షన్ కమిటీగా ఎంపికైన అక్మల్.. ప్రస్తుతం తన కొత్త పాత్రపై దృష్టి సారించాడు. చివరిసారిగా 2017లో పాకిస్థాన్ తరపున ఆడాడు. నవంబర్ 2002లో అక్మల్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతని కీపింగ్ నైపుణ్యాల వల్ల పాకిస్తాన్ ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. ఇక పీఎస్‌ఎల్‌లో తాను ప్రాతినిధ్యం వహించిన పెషావర్ జాల్మీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. పిసిబిలో జాతీయ సెలక్షన్ కమిటీకి ఎంపికయ్యాయని ఇకపై దానిపైనే తన దృష్టి ఉంటుందని, ఇకనుంచి క్రికెట్ ఆడను అని అక్మల్ పేర్కొన్నారు. చిన్నలీగ్‌లలో మాత్రం పాల్గొంటానని ఆయన వెల్లడించారు.
కమ్రాన్ అక్మల్ సాధించిన రికార్డులివే
హరూన్ రషీద్ అధ్యక్షతన ఉన్న పాకిస్థాన్ సెలక్షన్ కమిటీలో అక్మల్ ఇటీవలే చోటు దక్కించుకున్నాడు. తౌసీఫ్ అహ్మద్, అర్షద్ ఖాన్, షాహిద్ నజీర్, షోయబ్ ఖాన్‌లతో కూడిన పిసిబి జూనియర్ సెలక్షన్ కమిటీ అధ్యక్షుడిగా కూడా అతన్ని నియమించారు. అక్మల్ ఎనిమిది మంది సభ్యులు ఎంపిక కమిటీకి నాయకత్వం వహించనున్నాడు. అక్మల్ 53 టెస్టుల్లో 2,648 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సెంచరీలు, 12 అర్ధసెంచరీలు ఉన్నాయి. 157 వన్డేల్లో 3236 పరుగులు చేశారు. ఇందులో ఐదు సెంచరీలు, 10 అర్ధ సెంచరీలున్నాయి. 58 టీ20 మ్యాచ్‌లు ఆడి 987 పరుగులు చేశాడు. పీఎస్‌ఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అక్మల్ నిలిచాడు.