పాక్ క్రికెట్ బోర్డు వ్యాఖ్యలపై రవిచంద్రన్ అశ్విన్ సీరియస్
ఆసియాకప్ 2023 వివాదం రోజు రోజుకు ముదురుతోంది. పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్‌ను నిర్వహిస్తే.. పాక్‌లో ఆడేదిలేదని టీమిండియా ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవేళ ఆడాలని భావిస్తే మాత్రం వేదికను మార్చాలని సూచించింది. పాకిస్తాన్‌లో టీమిండియా ఆసియాకప్ ఆడకపోతే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్‌లో పాక్ ఆడదిలేదని ఆ జట్టు క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సౌథీ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై తాజాగా రవిచంద్రన్ అశ్విన్ స్పందించారు. వన్డే ప్రపంచ కప్ ఆడకుండా పాక్ వదిలేస్తుందని అనుకోవడం లేదని తెలిపారు. ఆసియాకప్‌లో వేదిక మార్చడం చాలాసార్లు జరిగిందని, ఆసియాకప్ పాకిస్తాన్‌లో నిర్వహించకూడదని తాము తెలియజేశామని, ఇక టోర్ని నిర్వహణకు సంబంధించి తుది నిర్ణయం ఏసీసీదేనని అశ్విన్ వెల్లడించారు.
శ్రీలంకలో ఆసియాకప్ నిర్వహించాలి
ఆసియాకప్ శ్రీలంకకు తరలిపోయే అవకాశం ఉందని, దుబాయ్‌లో ఇటీవల కాలంలో చాలా టోర్నీలు జరిగాయని, కానీ చాలా కాలంగా లంకలో మేజర్ టోర్నీ జరగలేదని, లంకలో ఆసియాకప్ జరిగితే తాను చాలా సంతోషిస్తానని అశ్విన్ పేర్కొన్నారు. దీనిపై మళ్లీ వచ్చే నెలలో ఒకసారి ఏసీసీ సభ్యులు సమావేశంకానున్నారు. అయితే ఎన్ని సమావేశాలు జరిగినా తాము పాకిస్తాన్ కు వెళ్లే ఛాన్స్ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.