ఆసియా కప్ 2023 నిర్వహణపై స్పష్టత రానట్లేనా..?
ఆసియాకప్ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాకిస్తాన్‌కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఎందుకంటే ఆసియా కప్ మీటింగ్‌లో 'ప్రభుత్వ క్లియరెన్స్' చర్చలను పాకిస్తాన్ బోర్డు తిరస్కరించింది టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇప్పటికీ ఎటువంటి ఒప్పందం కుదరకపోవడం గమనార్హం. టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే హక్కులు పాకిస్థాన్‌కు ఉన్నప్పటికీ, బీసీసీఐ తమ జట్టును దేశానికి పంపేందుకు సుముఖంగా లేదు. ఇంకా చర్చలు కొనసాగుతుండడంతో నిర్ణయాన్ని మార్చికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. టోర్నమెంట్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అన్ని దేశాలు ప్రభుత్వ క్లియరెన్స్ కోరాలని కోరినట్లు కూడా ఒక నివేదిక స్పష్టం చేసింది.
వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పాల్గొనలేదు
పాకిస్తాన్ జరిగే ఆసియా కప్ లో పాల్గొనడానికి ప్రభుత్వ క్లియరెన్స్ కోరే ఉద్ధేశాన్ని సభ్యులెవరూ సూచించలేదని ఇప్పటికే పిసిబి పేర్కొంది. భారత్‌తో ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు తాము కూడా రాబోమని పాకిస్తాన్ పలుమార్లు బాహాటంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకునేందుకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియాకప్ 2023ని యూఏఈకి తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. నిన్న బహ్రెయిన్లో జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగింది. పాక్ వేదికగా ఆసియా కప్‌లో భారత్‌లో పాల్గొనకబోతే.. అక్టోబర్ - నవంబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనదని జైషా దృష్టికి నజామ్ సేథీ ఈ విషయాన్ని తీసుకెళ్లిన విషయం తెలిసిందే.