Page Loader
ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్
ఐదుసార్లు ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా మహిళలు

ఫిబ్రవరి 12న భారత్-పాకిస్తాన్ మ్యాచ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 04, 2023
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 8వ ఎడిషన్ ఫిబ్రవరి 10న ధక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానుంది. ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా మళ్లీ టైటిల్ పై కన్నేసింది. 2020 ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత మహిళలు ఈసారీ ఎలాగైనా ప్రపంచ కప్ ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఫిబ్రవరి 12న భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో పోరుకు సిద్ధమైంది. గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు, గ్రూప్-బిలో ఇంగ్లండ్, భారత్, పాకిస్తాన్, వెస్టిండీస్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్లు ఫైనల్‌లో పోటీ పడుతాయి. ఫిబ్రవరి 26న ఫైనల్ మ్యాచ్ జరగునుంది.

టీమిండియా

ప్రపంచ కప్‌పై కన్నేసిన టీమిండియా

హర్మన్‌ప్రీత్ కౌర్ భారత మహిళలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2020లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా కప్‌ను అందుకుంది. స్పిన్ విభాగంలో దీప్తిశర్మ, రేణుకా సింగ్‌తో టీమిండియా బలంగా ఉంది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ భారీ పరుగులు సాధిస్తే టీమిండియా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారు. అలిస్సా హీలీ, కెప్టెన్ మెగ్ లానింగ్, ఆల్-రౌండర్లు తహ్లియా మెక్‌గ్రాత్, ఎల్లీస్ పెర్రీ అద్భుతంగా ఆడుతున్నారు. ఇటీవల స్వదేశంలో జరిగిన టీ20ల్లో పాకిస్థాన్‌ను ఆస్ట్రేలియా 2-0తో ఓడించింది. న్యూజిలాండ్ రెండుసార్లు రన్నరప్‌గా నిలిచింది. 2018, 2020లో మొదటి రౌండ్లలోనే న్యూజిలాండ్ నిష్క్రమించింది. ఈసారి ప్రపంచ కప్ ను కైవసం చేసుకోవాలని న్యూజిలాండ్ కసిగా ఉంది.