Page Loader
ముక్కొణపు సిరీస్‌లో అదరగొట్టిన స్మృతి మంధాన,  హర్మన్‌ప్రీత్ కౌర్
అద్భుత హాప్ సెంచరీలతో అకట్టుకున్న స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్

ముక్కొణపు సిరీస్‌లో అదరగొట్టిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2023
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై-సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు విజయం సాధించింది. స్టార్ బ్యాట్ మెన్స్ స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ భారత్‌ అద్భుతమైన విజయాన్ని అందించారు. దీంతో టీమిండియా మహిళల జట్టు 20 ఓవర్లలో 167/5 స్కోరు సాధించింది. దీప్తి శర్మ 2/29 రాణించగా.. భారత్ అద్భుత ప్రదర్శనతో ఈ మ్యాచ్ లో గెలుపొందింది. మంధాన, హర్మన్‌ప్రీత్ 3వ వికెట్‌కు 115 పరుగులు జోడించి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి సత్తా చాటారు. హర్మన్‌ప్రీత్ 56* పరుగులు, మంధాన అజేయంగా 74 పరుగులు సాధించారు. బౌలింగ్ విభాగంలో దీప్తి, రాజేశ్వరి గయక్వాడ్, రాధా యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి వెస్టిండీస్ బ్యాటర్ల నడ్డి విరిచారు.

మంధాన

20 అర్ధ సెంచరీలు సాధించిన మంధాన

మంధాన తన 20వ యాభైని సాధించి పలు రికార్డులను బద్దలు కొట్టింది. మాజీ ఇంగ్లండ్ మహిళా స్టార్ ఎడ్వర్డ్స్ (2,605) రికార్డును మంధాన అధిగమించింది. మంధాన 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74*-పరుగులు చేసింది. ఆమె 28.02 సగటుతో 2,887 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 35 బంతుల్లో 8 ఫోర్లతో 56* పరుగులు చేసింది. ఆమె 28.02 సగటుతో 2,887 పరుగులు చేసి, తన తొమ్మిదవ హాప్ సెంచరీని నమోదు చేసింది. తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 27 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళలపై విజయం సాధించిన విషయం తెలిసిందే.