వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ట్రై సిరీస్‌లో వెస్టిండీస్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మహిళలు 20 ఓవర్లలో 167/2 స్కోర్ చేశారు. మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరు హాప్ సెంచరీలు చేసి చేలరేగడంతో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. రాజేశ్వరి గయక్వాడ్, రాధా యాదవ్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేశారు. మంధాన, హర్మన్‌ప్రీత్ 3వ వికెట్‌కు 115 పరుగులు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓపెనర్ స్మృతి మంధాన 51 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు సాధించి ఆఖరి వరకు అజేయంగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులివే..
మాజీ ఇంగ్లండ్ మహిళా స్టార్ సీఎం ఎడ్వర్డ్స్ (2,605) రికార్డును మంధాన 2646 పరుగులతోఅధిగమించింది. హర్మన్‌ప్రీత్ 35 బంతుల్లో 8 ఫోర్లతో 56* పరుగులు చేసింది. ఆమె 28.02 సగటుతో 2,887 పరుగులు చేసింది. విండీస్‌తో జరిగిన ఆరు మ్యాచ్‌లలో దీప్తి 9.18 సగటుతో 11 వికెట్లను పడగొట్టింది. గయాక్వాడ్ 18.33 సగటుతో 56 వికెట్లు పడగొట్టింది. గయాక్వాడ్ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా నిలిచింది. విండీస్ మహిళల తరఫున షెర్మైన్ క్యాంప్‌బెల్ 57 బంతులు ఎదుర్కొని 47 పరుగులు చేసింది. ఆమె ప్రస్తుతం 14.20 సగటుతో 952 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ 34 పరుగులు చేసింది. ఆమె 18.64 సగటుతో 1,300 పరుగులు చేసింది