Page Loader
ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు
స్మృతి మంధన 2022లో 600 పరుగులు చేసింది

ఐసీసీ మహిళల టీ20 జట్టులో నలుగురు భారత ప్లేయర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 24, 2023
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంవత్సరానికి గానూ 11 మంది మహిళల టీ20 జట్టును ఎంపిక చేసింది. ఈ లిస్టులో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లకు అవకాశం దక్కింది. ఇందులో భారత్ ఓపెనర్ స్మృతిమంధన ,దీప్తి శర్మ, రీచాఘోస్, రేణుకాసింగ్ ఉన్నారు. ఈ టీమ్‌కు న్యూజిలాండ్‌కి చెందిన ఆల్‌రౌండర్ సోఫీ డెవిన్ కెప్టెన్‌గా, రీచాఘోష్ కీపర్‌గా ఐసీసీ ఎంపిక చేసింది. టీమిండియా ఓపెనర్ మంధన, ఆసీసీ బ్యాటర్ మూనీ ఓపెనర్లగా ఎంపికయ్యారు. మంధన ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకపై ఐదు అర్ధ సెంచరీలు చేసింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఆమె రెండు అర్ధశతకాలు చేసింది. ఆసీస్ బ్యాటర్ మూనీ 56.12 సగటుతో 449 పరుగులు చేసింది.

ఐసీసీ

ఐసీసీ మహిళల క్రికెట్ జట్టు ఇదే..

మూడో స్థానంలో వచ్చే డివిన్ బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటుతోంది. ఇప్పటికే 389 పరుగులు చేసి 13 వికెట్లు తీసింది. ఆల్ రౌండర్ల జాబితాలో నిదా, దీప్తి, తహ్లియా ఉన్నారు. ఆస్ట్రేలియా కు చెందిన తహ్లియా 435 పరుగులు చేసింది. అందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నారు. బౌలింగ్ విభాగంలో 13 వికెట్లు తీసింది. పాకిస్థాన్‌కు చెందిన నిదా దార్ 18.33 సగటుతో 15 వికెట్లు పడగొట్టాడు. ఆఫ్ స్పిన్నర్ దీప్తి ఆసియాకప్‌లో 13 వికెట్లతో సహా 18.55 సగటుతో 29 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌తో ఆమె 37.00 సగటుతో 370 పరుగులు చేసింది. స్మృతిమంధాన, బెత్‌మూనీ, సోఫీడివైన్ (కెప్టెన్), యాష్‌గార్డనర్, తహ్లియా‌మెక్‌గ్రాత్, నిదాదార్, దీప్తిశర్మ, రిచా‌ఘోష్ (వికెట్-కీపర్), సోఫీ‌ఎక్లెస్టోన్, ఇనోకారణవీర, రేణుకాసింగ్