Page Loader
ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం
శ్రీలంకపై విజయం సాధించిన భారత్

ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2023
04:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచ కప్ లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై భారత్ విజయం సాధించింది. భారత్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సౌమ్య తివారీ టీమిండియా తరుపున అద్భుతంగా రాణించింది. భారత్ స్పిన్నర్లు టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్రీలంక నిర్ణీత 20ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి కేవలం 59పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా బౌలర్లులో పర్సావీ చోప్రా 4వికెట్లు తీసింది. కాశ్యప్ 2, సాధు, అర్చనాదేవీ చెరో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష ఛేదనలో భారత్ 7.2 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి చేసి విజయం సాధించింది.

భారత్ మహిళల జట్టు

సౌమ్య తివారి మెరుపు ఇన్నింగ్స్

అనంతరం 60 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్‌.. 7.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అడుతూ పాడుతూ విజయం సాధించింది. షెఫాలీ వర్మ (15), శ్వేత సెహ్రావత్‌ (13), రిచా ఘోష్‌ (4) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సౌమ్య తివారి (15 బంతుల్లో 28; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చింది. లంక బౌలర్లలో దేవ్మీ విహంగ 3 వికెట్లు పడగొట్టింది. ఈ గెలుపుతో భారత్‌.. సూపర్‌ సిక్స్‌ గ్రూప్‌-1లో రెండో స్థానానికి ఎగబాకింది.