ముక్కోణపు సిరీస్‌లో అదరగొట్టిన భారత్ అమ్మాయిలు
టీ20 ట్రై సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మహిళలపై భారత్ మహిళలు అదరగొట్టారు. ఈస్ట్ లండన్ లో గురువారం రాత్రి జరిగిన ఆరంభ మ్యాచ్ లో భారత్ 27 పరుగుల తేడాతో ధక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 147/6 స్కోర్ చేసింది. ఓపెనర్ యస్తికా భాటియా (34 బంతుల్లో 35) ఫర్వాలేదనిపించినా కెప్టెన్ మందాన, హర్లీన్, జెమీయా, దేవికా నిరాశ పరిచారు. టీ20లో అరంగేట్రం చేసిన అమంజోత్ కౌర్ 30 బంతుల్లో 41 పరుగులు చేసి సత్తా చాటింది. దీప్తి శర్మతో(33) కలిసి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.
అమన్ జోత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
అమన్‌జోత్‌కు అరంగేట్రం చేసిన మ్యాచ్ లో 41 పరుగులు చేసి రికార్డును నెలకొల్పింది. అంతకుముందు స్మృతి మంధాన అరంగేట్రం చేసిన మ్యాచ్ లో 37 పరుగులు చేసింది. దీప్తి 23 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి 33 పరుగులు చేసింది. ఆమె ఇప్పుడు 83 మ్యాచ్‌లలో 25.65 సగటుతో 898 పరుగులు చేసింది. ధక్షిణాఫ్రికా విజయం కోసం సున్ లూస్ (29), చ్లోయె ట్రైన్ (26), మరిజానె కాప్ (22) పోరాడినా ఫలితం లేకుండా పోయింది . భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు, దేవిక రెండు వికెట్లతో సత్తా చాటారు. అమన్ జోత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.