Page Loader
ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 20, 2023
01:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభ ఎడిషన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అనుమతిచ్చింది. ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చిలో జరిగే అవకాశం ఉంది. మొదటి మూడేళ్లలో ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా.. చివరి రెండేళ్లలో ఆరు జట్లకు అవకాశం కల్పించారు. బీసీసీఐ ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌ల తేదీలకు అధికారికంగా ప్రకటించలేదు. మార్చి 24 నుంచి జరిగే అవకాశం ఉంటుందని అంతా భావిస్తున్నారు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం, పాటిల్‌ స్టేడియంలో మొదటగా 22మ్యాచ్‌లు జరగనున్నాయి. WIPL ప్రైజ్‌మనీలో గెలిచిన జట్టుకు రూ. 6కోట్లు, రన్నరప్‌కు రూ.3 కోట్లు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 1 కోటి ఇవ్వనున్నారు

ఉమెన్స్ ఐపీఎల్ లీగ్

ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు

ప్లేయర్ ప్రైజ్‌మనీ మొత్తం ఆటగాళ్లకు మాత్రమే పంపిణీ చేయనున్నారు. మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను Viacom18 అదిరిపోయే ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా రూ.952 కోట్లను కొనుగోలు చేేసి ఐదేళ్ల పాటు ప్రసారాలను చేయనుంది. దీంతో ఒక్కొక్క మ్యాచ్ విలువ రూ. రూ. 7.09 కోట్లు ఉండనుంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మహిళల క్రికెట్ లీగ్‌గా ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ అవతరించింది. ఇప్పటికే చెన్నైసూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ IPL జట్టు యజమానులు మహిళల IPL ఎడిషన్ కోసం బిడ్ లను సమర్పించిన విషయం తెలిసిందే.