
ఉమెన్స్ ఐపీఎల్లో ఒక్కో మ్యాచ్‌కు రూ.7కోట్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఉమెన్స్ ఐపీఎల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి జరగనున్న ఈ లీగ్ హక్కులు ఏకంగా రూ.951 కోట్లకు అమ్ముపోయామంటే ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఇండియాలో ఐపీఎల్ ఎలాంటి సంచలనం సృష్టించిందో మనకు తెలిసిందే. గత 15 ఏళ్లలో ఈ లీగ్‌కు డిమాండ్ పెరుగుతోందా తప్పా తగ్గడం లేదు. ప్రస్తుతం మహిళ క్రికెట్లో ఇలాంటి అద్భుతం జరగబోతోంది.
ఉమెన్స్ మీడియా హక్కులను వేలం వేయగా రూ.951 కోట్లు వచ్చినట్లు బీసీసీఐ సెక్రటరీ జైషా వెల్లడించారు. వయాకామ్ 18 ఈ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. వచ్చే ఐదేళ్లు (2023-27) కాలానికి గాను ఈ హక్కులను వేలం వేశారు. ఒక్కో మ్యాచ్ వయాకామ్ 18 రూ.7.09 కోట్లను చెల్లించనుంది.
ఉమెన్స్ ఐపీఎల్
మహిళల ఐపీఎల్ బిడ్‌ల కోసం దరఖాస్తులు
మహిళల ఐపీఎల్ 2023 టీ20 లీగ్ కోసం స్క్యాడ్ లను ప్లేయర్ వేలం ద్వారా ఎంపిక చేయనున్నారు. ప్లేయర్ వేలానికి రిజిస్టర్ చేసుకునేటప్పుడు క్యాప్డ్, అన్‌క్యాప్డ్ క్రికెటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని BCCI ఇప్పటికే పిలుపునిచ్చింది. దీని కోసం జనవరి 26 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది.
ఇప్పటికే చెన్నైసూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ IPL జట్టు యజమానులు మహిళల IPL ఎడిషన్ కోసం బిడ్‌లను సమర్పించాయి.
2023 నుంచి 2025 వరకు మూడు సీజన్లలో ఒక్కో జట్టుకు 22 మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంది. లీగ్ దశలో ఒక్కో టీమ్ 20 మ్యాచులు ఆడనుంది