అశ్విన్‌కు వార్నర్ చెక్ పెట్టేనా..?
టీమిండియా ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో టీమిండియా పోటి పడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, స్పిన్ మంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్‌తో తలపడనున్నాడు. గతేడాది స్వదేశంలో దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు వార్నర్ పేలవమైన ఫామ్‌తో కొనసాగించాడు. అయితే తన 100వ టెస్టులో డబుల్ సెంచరీ చేసి చరిత్రకెక్కాడు. భారత్‌లో ఆడిన టెస్టుల్లో వార్నర్‌కు మెరుగైన రికార్డు లేదు. అశ్విన్ బౌలింగ్‌లో వార్నర్‌కు బ్యాటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అశ్విన్‌పై 385 బంతుల్లో 182 పరుగులు చేశాడు. ముఖ్యంగా అశ్విన్ పదిసార్లు వార్నర్‌ను పెవిలియానికి పంపాడు.
వార్నర్ వర్సస్ అశ్విన్
భారత్‌పై 18 టెస్టులు ఆడిన వార్నర్ 33.76 సగటుతో 1,148 పరుగులు చేశాడు. ఇందులో నాలుగుసెంచరీలు, మూడు అర్ధ సెంచరీలున్నాయి. 2013 పర్యటనలో 195 పరుగులు చేశాడు. 2017 సిరీస్‌లో మొత్తం 193 పరుగులను అశ్విన్ చేశాడు. ఆసీస్‌పై 18 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 31.48 సగటుతో 89 వికెట్లు తీశాడు. 2017లో స్వదేశంలో జరిగిన ఆస్ట్రేలియా చివరి సిరీస్ లో అశ్విన్ 21 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా 2013 సిరీస్‌లో 20.10 సగటుతో 29 వికెట్లు తీసి సత్తా చాటాడు. వార్నర్ 2011లో న్యూజిలాండ్‌పై అరంగేట్రం చేశాడు. మొత్తం 101 టెస్టుల్లో 46.20 సగటుతో 8,132 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలున్నాయి. అశ్విన్ 88 టెస్టులాడి 449 వికెట్లు తీశాడు.